Suryaa.co.in

Andhra Pradesh

ఎన్డీయే పాలనలో దేశానికి, రాష్ట్రానికి మంచి రోజులు

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్

విజయవాడ: ఏ దేశం అయినా అభివృద్ధి చెందాలి అంటే కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి.. అందులో ప్రధానంగా వ్యవసాయం, చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందాలి… అందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రవేశపెట్టారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

వికసిత భారత్ కేవలం మోడీతో సాధ్యం. అందుకు అనుగుణంగానే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉంది… దేశంలో వున్న ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి కూడా బడ్జెట్ లో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే.. దేశం అభివృద్ధి చెందాలి అంటే దేశం తలసరి ఆదాయం పెరగాలి. భారత్ తలసరి ఆదాయం పెరగాలి అంటే 7.6 శాతం పెరిగితే దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు… దీనితో పాటు మధ్యతరగతి కుటుంబంలో 12 లక్షల ఆదాయం ఉన్న వారికి ఆదాయ పన్ను సడలింపు చేశారు… ఎంఎస్‌ఎంఇలకు 2లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు.

మంచి చదువులు చదువుకున్న యువతకు ఎంస్‌ఎంఇ రుణాలు పెంచుతూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ లో మహిళలకు గతంలో కంటే రుణాలు ఎక్కువ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు.. దేశ వ్యాప్తంగా వున్న విద్య సంస్థలకు ఆంధ్రా రాష్ట్రానికి బడ్జెట్ లో ప్రాముఖ్యత ఇచ్చారు. అమరావతి, పోలవరానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. గతంలోనే అమరావతిని స్మాట్ సిటీ గా ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి పునర్జీవం కల్పించే దిశగా అడుగులు పడ్డాయి.

రైల్వే బడ్జెట్ ఆంధ్రకు ప్రత్యేక కేటాయింపులు చేశారు… విశాఖ పోర్టు కి 730 కోట్లు కేటాయింపు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యింది… కానీ, నేడు చంద్రబాబు ఎన్డీయే నాయకత్వంలో రాష్ట్రానికి నిధులు అధికంగా వస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్యంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోంది.

LEAVE A RESPONSE