– టిడ్కో ఇళ్లు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని మోసం చేసిన రాము, పృద్వీ
– ఫిర్యాదుదారులను నుంచి ఆర్జీలను స్వీకరించిన రెడ్డప్పగారి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ అశోక్ బాబు
మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భూ సమస్యలతోపాటు అనేక సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి అర్జీదారులను పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ అశోక్ బాబు వినతులు స్వీకరించారు. అనేక సమస్యలపై సంబంధించిన అధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
నంద్యాల జిల్లా, సంజూమల మండలం, నొస్సం గ్రామానికి చెందిన అల్లూరి సత్యరాజు అనే వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి దేవరాజు పేరుపై ఉన్న 3 ఎకరాల డికే పట్టాను అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వం వస్తే లోన్స్ ఇప్పిస్తానని వాగ్దానం చేసి, తన తండ్రి నుండి పట్టాను తీసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. తన తండ్రి మరణించిన తర్వాత, ఆ భూమిని తనదేనని రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• అనంతపురం జిల్లా, కుందుర్పి మండలం, యర్రగుంట గ్రామానికి చెందిన ఎం. మంజునాథ్ అనే వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నెం. 488-1లో ఉన్న తన 5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కాపు శ్రీదేవి అనే మహిళ తన పేరుకు బదిలీ చేసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు తగిన విచారణ చేసి, భూమిని కబ్జా నుండి విడిపించాలని, దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
• విశాఖపట్నం, డాబాగార్డెన్స్ కు చెందిన కున్నత్తు నాగమణి అనే వృద్ధ మహిళ విజ్ఞప్తి చేస్తూ.. 2018లో టిడ్కో ఇంటికి సంబంధించి 2018లో టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. వైఎస్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు టిడ్కో ఇల్లు రాలేదని చెప్పారు. తనకు ఇల్లు ఇప్పించి న్యాయం చేయాలని గ్రీవెన్స్ ద్వారా అర్జీ సమర్పించి విజ్ఞప్తి చేసింది.
• విజయవాడకు చెందిన పఠాన్ సూరియా సుల్తాన్ విజ్ఞప్తి చేస్తూ.. విజయవాడ, రామవరప్పాడు చెందిన రామ్, పోరంకి చెందిన పృద్వీ అనే ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వం నుండి ఇల్లు ఇప్పిస్తామని నాలుగేళ్ళ కిందట రూ. 5 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
• పల్నాడు జిల్లా, గురజాల మండలం, గంగవరం గ్రామానికి చెందిన పేరుపోగు ఏసమ్మ అనే మహిళ విజ్ఞప్తి చేస్తూ.. తనకు చెందిన 3.1/2 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన పేరుపోగు పెదమల్లయ్య అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నట్టు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా నుండి విడిపించి న్యాయం చేయాలని కోరారు.
• అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం, జంపపాలెం గ్రామానికి చెందిన శిలపరశెట్టి సత్యనాగదేవకి అనే మహిళ విజ్ఞప్తి చేస్తూ.. తన గ్రామంలో నాలుగేళ్ళుగా మంచినీటి సమస్య, శ్మశానవాటిక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం గ్రీవెన్స్ ద్వారా అర్జీ సమర్పించి విజ్ఞప్తి చేశారు.
• తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం, భూపాలపట్నం గ్రామానికి చెందిన కుడుపూడి రామారావు విజ్ఞప్తి చేస్తూ, గత వైఎస్సీపీ ప్రభుత్వంలో తన భూమికి సంబంధించిన సర్వే నంబర్లను వైఎస్సీపీ నాయకులు తప్పుగా నమోదు చేయించారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో గ్రీవెన్స్ ద్వారా అర్జీ సమర్పించి న్యాయం కోరారు