Suryaa.co.in

Telangana

మాదిగ విద్యార్థి, ఉద్యోగ,విద్యావంతులు రేవంత్ రెడ్డి వెంటే..

– మాదిగ విద్యార్థి ఉద్యోగులకు కృష్ణ మాదిగ మోసం
– 11% రిజర్వేషన్అనడం బిజెపి పార్టీ కోసమే
– మాదిగలకు రిజర్వేషన్లు దక్కకుండా కృష్ణ మాదిగ కుట్ర
– ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి

హైదరాబాద్: మాదిగ విద్యార్థి ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటే ఉన్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ న్యూ సెమినార్ హాల్లో బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభకు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు మేధావులు ఉద్యోగులు అంతా ఎస్సీ వర్గీకరణ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించినందుకు చాలా ఆనందంగా ఉన్నారని, మాదిగ జాతి మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఉన్నారని అన్నారు.

మూడు దశాబ్దాలకు పైగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తగిన ఫలితం దక్కిన సందర్భంగా మాదిగ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇక భవిష్యత్తులో విద్యార్థులకు విద్యా ఉద్యోగ రంగాలలో అనేక అవకాశాలు వస్తాయని ఆశ భవంతో ఉన్నారని అన్నారు. కృష్ణ మాదిగ మాదిగలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నారని.. మూడు దశాబ్దాల ఉద్యమంలో ఏ రోజు 11% రిజర్వేషన్ అనే అడగలేదని 9% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 11% అనడం బిజెపి పార్టీ కోసమేనని అన్నారు.

బిజెపి పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే మాదిగలకు దక్కిన వర్గీకరణ ఫలాలను తిరిగి దక్కకుండా చేయడం కోసం, మరో కుట్ర జరుగుతుందని అందుకు కృష్ణ మాదిగ నాయకత్వంవహిస్తున్నారని అన్నారు. కృష్ణ మాదిగ కు మాదిగల వర్గీకరణ రిజర్వేషన్ల పట్ల సానుకూలంగా లేరని.. మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందకపోవటం వల్లనే మాదిగలంతా తన వెంట ఉంటారని భావించి 11 శాతం రిజర్వేషన్ కావాలని ఉన్న రిజర్వేషన్ తొలగించే కుట్ర చేస్తున్నారని అన్నారు. రేపటి నుంచి ఉమ్మడి పరి జిల్లాలో 119 నియోజకవర్గ కేంద్రాలలో మాదిగ జేఏసీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞత సభలు నిర్వహిస్తామని అన్నారు. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అనేక అస్తిత్వ ఉద్యమాలలో పిడమర్తి రవి గారి పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ మీసాల మల్లేశం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నరసింహ మాదిగ, మాదిగ విద్యార్థి చేసి చైర్మన్ డాక్టర్ రామగల సుందర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బొమ్మెర స్టాలిన్, బిఎస్ఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మొగిలిగిద్ద ప్రసాద్, స్పోర్ట్స్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చాగంటి రాజేష్, మాదిగ చేసి గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షులు చిరుమర్తి రాజు,బిఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్చార్జి కల్వకుర్తి శ్రీశైలం, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ శివ, మాదిగ రాజకీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఒక్కలగడ్డ చంద్రశేఖర్, మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జెర్రిపోతుల సాయన్న,రాష్ట్ర నాయకులు ఆరె కంటి శ్రీకాంత్, రింగు రాంబాబు, జోగు గణేష్ , జోగు నరేందర్, వేల్పకొండ రామకృష్ణ,మీసాల మహేష్, శంకర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE