Suryaa.co.in

Andhra Pradesh

రైతుల మహాపాదయాత్రను విచ్ఛిన్నంచేయడానికి ప్రభుత్వం కుట్రలు

– న్యాయస్థానంలో ప్రభుత్వం తరుపున్యాయవాది చేసిన వ్యాఖ్యలు, ఎంపీ నందిగంసురేశ్ మాటలే అందుకు నిదర్శనం.
– భూములతో పాటు, సర్వంకోల్పోయి, వేదనతో రైతులుపాదయాత్ర చేస్తున్నారు గానీ, జగన్మోహన్ రెడ్డిలా అధికారం కోసమో.. అవినీతి, అక్రమార్జన కోసమో చేయడంలేదు.
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
జగన్మోహన్ రెడ్డి తనపాలనలో ఎవరిమీదనైతే దాడిచేయాలనుకుంటాడో, దేనినైతే విఛ్చిన్నం చేయాలనుకుంటాడో, దానిపై తనపార్టీ నేతలతో ముందుగా మాట్లాడిస్తాడని, ఆ క్రమంలోనే తనపార్టీ ఎంపీ అయిన నందిగం సురేశ్ తో తాజాగా ముఖ్యమంత్రి అమరావతి రైతులమహాపాద యాత్రపై, ఉద్యమంపైదాడులకు రూపకల్పనచేస్తున్నట్లు చెప్పకనే చెప్పించారని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …!
పవిత్రమైన, మహోన్నతమైన అమరావతి రైతులఉద్యమంపై, వారు తలపెట్టిన మహాపాదయాత్రపై జగన్మోహన్ రెడ్డి కన్నుపడింది. దాన్ని తుత్తునియలుచేయడానికే ముఖ్యమంత్రి, నిన్న ప్రభుత్వసలహదారు సజ్జలతో, తనపార్టీఎంపీ నందిగం సురేశ్ తో ముందుగానే ప్రణాళికాబద్ధం గా మాట్లాడించాడు. గతంలో జోగిరమేశ్ చంద్రబాబుగారి ఇంటిపై దాడి చేస్తాననిచెప్పి, చివరకు దాడికి తెగబడ్డాడు. అదేవిధంగా టీడీపీ కార్యాలయంపై కూడా చెప్పిమరీ దాడిచేశారు. ఈ కోవలోనే అమరావతి ఉద్యమానికి పోటీగా కృత్రిమఉద్యమం నడిపించడానికి, స్వయంగా జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వమే సహాయసహాకారాలు అందించింది.
ఆ పాచికపారకపోవడంతో, ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వపెద్దల కన్ను అమరావతి రైతులమహాపాదయాత్రపై పడింది. ప్రజల అండతో, దేవుడి ఆశీస్సులతో న్యాయస్థానంనుంచి దేవస్థానం పేరుతో మహాపాద యాత్రచేస్తున్న రైతులమధ్యలోకి విచ్ఛిన్నకరశక్తులను పంపి, దాన్ని భగ్నంచేయడానికి ప్రభుత్వ కుట్రపన్నిందనే అనుమానం కలుగుతోంది. ఎంపీ నందిగం సురేశ్ వ్యాఖ్యలే అందుకు ప్రబల నిదర్శనాలు. గతంలో కూడా అమరావతి ఉద్యమాన్ని భగ్నంచేయడానికి ప్రభుత్వం, దళిత రైతులపైనే ఎస్సీఎస్టీఅట్రాసిటీకేసులుపెట్టి, బేడీలువేసి వారిని జైళ్లకు పంపింది. అమరావతి ఆడబిడ్డలను పోలీసులతో దారుణంగా బూటు కాళ్లతో తన్నించి రాక్షసానందం పొందింది. మహిళలనికూడా చూడకుండా వారిజుట్టుపట్టుకొని పొత్తికడుపుల్లో తన్నారు. అపవిత్రమైన, అసాం ఘికశక్తులైన వారే పాదయాత్రలు చేయగాలేనిది, రాష్ట్రరాజధానికోసం రైతులు, మహిళలు పాదయాత్రచేస్తే తప్పా? అమరావతిని చంపడానికి ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేసింది. న్యాయస్థానాలు అమరావతికి మద్ధతిచ్చాయన్న అక్కసుతో, ఆఖరికి వైసీపీచిల్లర బ్యాచ్ తో న్యాయమూర్తులను కూడా దూషించారు.
ఈ విధంగా చేయాల్సిన దిక్కుమాలినపనులన్నీ జగన్ ప్రభుత్వం, ఆయన వందిమాగధులు చేశారు. వారి దుర్మార్గాలను ఎదిరించి దాదాపు 700 రోజులునుంచీ అమరావతికోసం ఉద్యమిస్తున్నవారు, పాదయాత్రచేపడి తే, దాన్ని కోర్టులద్వారా అడ్డుకోవడానికి కూడా జగన్ ప్రభుత్వం ప్రయ త్నించింది. న్యాయస్థానాలు చీవాట్లుపెట్టినా, ప్రజలు ఛీత్కరించినా ప్రభుత్వ వైఖరిలో మార్పురాలేదు. అమరావతి మహాపాదయాత్రపై ప్రభుత్వందాడి చేస్తోందని చెప్పడానికి అనేకఆధారాలున్నాయి. పాద యాత్రలో సంఘవిద్రోహకర శక్తులను ప్రవేశపెట్టి, దాన్ని విచ్ఛిన్నం చేయ డానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనడానికి, కోర్టులో నేడు పాలకుల తరు పు న్యాయవాదులు చేసిన వాదనలే నిదర్శనం.
అమరావతిపాదయాత్ర కు న్యాయస్థానం అనుమతిఇస్తే, శాంతిభద్రతల సమస్యతలెత్తుందని, ఉద్యమంచేస్తున్నవారిపై రాళ్లువేసే ప్రమాదముందని, ప్రభుత్వం తరుపు న్యాయవాదులు చెప్పడమే అందుకు నిదర్శనం. వైసీపీప్రభుత్వం, ఆపార్టీ నేతలు నిర్వహించే కార్యక్రమాలను రాష్ట్రంలో ఎక్కడా ఎవరూ అడ్డుకోవడంలేదు. టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లు విసరడం లేదు. అలాంటప్పుడు భూములుకోల్పోయిన రైతులు పాద యాత్రచేస్తుంటే, వారిపై రాళ్లేస్తారా? ఎవరో పనికిమాలినవారిని వారిపైకి ఉసిగొలిపి, రాళ్లేయిస్తే తప్ప, సామాన్య ప్రజలెవరూ ఆపనిచేయరు.
అమరావతిరైతులు పాదయాత్ర చేస్తోంది అధికారం కోసం, ముఖ్యమంత్రి కుర్చీకోసం కాదు. తల్లిని, చెల్లిని స్వార్థానికి వాడుకొని వదిలేయడం కోసమోకాదు, అధికారాన్ని అడ్డుపెట్టుకొనిఆస్తులు కూడబెట్టుకోవడాని కి, కుంభకోణాలు చేయడానికి కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే, ఏపీలో జరిగే వికృతచర్యలకు చంద్రబాబు నాయడు ఎలా కారకులు అవుతారో నందిగం సురేశ్ చెప్పాలి. ఎంపీ నందిగం సురేశ్ రాజధానిలో ఓటు ఉంచుకొని, బాపట్లలో ఎలా పోటీ చేశాడు? రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగల సమర్థత, సత్తా చంద్రబాబు కు మాత్రమే ఉన్నాయనే వాస్తవాన్నిసురేశ్ తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏమీ చేయకపోతే,ఇప్పుడు పాలన వెలగబె డుతున్నవారు ఎక్కడ కూర్చుంటున్నారో, ఏ కప్పుకింద ఉండి, రైతుల కు భయపడి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారో సురేశ్ చెప్పాలి.
బద్వేల్ లో టీడీపీ పోటీచేయలేదు కాబట్టే, అక్కడి ఓటర్లు వైసీపీకి ఓటేశారు. ప్రభుత్వం ఏంచేసిందని పాలకులను నమ్మి బద్వేల్ ఓటర్లు అధికారాపార్టీకి ఓటేశారనే ఇంగితంకూడాలేకుండా సురేశ్ మాట్లాడుతున్నాడు. అమరావతిలో టీడీపీప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లనే, జగన్ ప్రభుత్వం లక్నో ఎగ్జిబిషన్లో తమఘనతగా చెప్పుకుంది. చంద్రబాబునాయుడు పేదలకు ఇళ్లునిర్మిస్తే, వాటిని తామే కట్టామని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుకూడాలేదు.
నేరంతో కలిసి పెరిగినవారు, ఇలాంటిపనులే చేస్తారు. అమరావతిప్రాంతంలో ముఖ్యమంత్రి ఇంటిసమీపంలోని పేదలఇళ్లను ఎందుకోసం, ఎవరు తొలగించారో నందిగంసురేశ్ కు తెలియదా? 5028 టిడ్కో గృహాలను చంద్రబాబునాయుడు పేదలకోసం నిర్మిస్తే, వాటిని జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇవ్వకుండా టీడీపీపై నిందలు వేస్తున్నాడు. వైసీపీకి చెందిన పొదిల శివమురళి అనేవ్యక్తి ఇళ్లనిర్మాణంపై హైకోర్టుకివెళితే, టీడీపీ ఇళ్లనిర్మాణాన్ని అడ్డుకుంటోందని, నందిగం సురేశ్ లాంటి వారు మాట్లాడటం, అతనిలోని అజ్ఞానాన్ని సూచిస్తోంది.

LEAVE A RESPONSE