– రైతుల నిరసన
– టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు షాక్
హసన్‌పర్తి మండలం, దేవన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్ సభ కోసం స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు, అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పంట పొలాల్లో సభను నిర్వహించవద్దంటూ ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించేందుకు వరంగల్‌లో భారీ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. స్థల సేకరణ కోసం బుధవారం టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి, కొంతమంది ఎమ్మెల్యేలు, అధికారులు దేవన్నపేటలో స్థల సేకరణ కోసం వెళ్లారు. అయితే వారిని రైతులు అడ్డుకున్నారు. పంట పొలాలను నాశనం చేయవద్దని కోరారు. ఇక్కడ సభ నిర్వహిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.