Suryaa.co.in

Andhra Pradesh

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కొత్తగా సంక్షేమశాఖ

– పరిధిలోకి రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య కార్పొరేషన్లు
అమరావతి : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కొత్తగా సంక్షేమశాఖ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు కొత్తగా సంక్షేమ శాఖను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీ రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లు దీని పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీయేతరుల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలలోపు ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ)గా పరిగణిస్తారు. వీరికి విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీలుగా కొత్తగా సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆ వర్గాలకు చెందిన సంస్థల ద్వారా ఈబీసీలు ఆర్థికంగా మెరుగుపడేలా, సామాజిక, విద్యా, ఆర్థికాభివృద్ధి ఫలాలు పొందేలా ఈ శాఖ పర్యవేక్షించనుంది.

LEAVE A RESPONSE