రోడ్డు ప్రమాదంలో సూళ్లూరుపేట ఎంపిడిఓ నర్మద దుర్మరణం

– ఆదిశంకర కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
– ముందు వెళుతున్న లారీని ఢీ కొన్న కారు,కారులో ప్రయాణిస్తున్న ఎంపిడిఓ దుర్మరణం
గూడూర్ రూరల్ లోని ఆదిశంకర కాలేజ్ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న సూళ్లురుపేట ఎంపీడీవో నర్మద దుర్మరణం, కారులో ఎంపీడీవో భర్త కొడుకు ఉన్నట్టు సమాచారం, వీరు నెల్లూరు నుండి సూళ్లూరుపేట వైపు వెళుతుండగా ఘటన .. సంఘటన స్థలానికి చేరుకున్న గూడూరు రూరల్ ఎస్సై బ్రహ్మనాయుడు,పోలీసు సిబ్బంది, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.