Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ విధానాలు రైతు మెడలకు ఉరితాళ్లు

ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటాం
టీడీపీ ఎమ్మెల్యే డా.నిమ్మల రామానాయుడు

టీవీల్లోనూ, మీడియాలోనూ ప్రతి ధాన్యం గింజ కొంటామని ప్రభుత్వం ఊదరగొడుతుంది కానీ ఈరోజు ఏ రైస్ మిల్లు దగ్గర చూసినా ట్రాక్టర్ మీద, లారీల మీద 3, 4 రోజులు పాటు ప్రతి మిల్లు దగ్గర ధాన్యం బస్తాలతో రైతులు పడిగాపులు కావలసిన పరిస్థితి ఉంది అన్నారు. కష్టపడి పంటను పండించిన పంటను ధాన్యం అమ్ముకోవడానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్తే అక్కడ సివిల్ సప్లై ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్లే సంబంధిత మిల్లుకు పంపించి మళ్లీ ఈ మిల్లు దగ్గర దింపుకోవడానికి ఎదురు డబ్బులు 5వేలు,10 వేలు,20 వేలు కట్టమంటే రైతు పరిస్థితి ఏమిటి?

ఇప్పటికే రైతు పంట పండించడానికి అప్పుల పాలయ్యాడు, తిరిగి ధాన్యం అమ్ముకోవడానికి కూడా ఎదురు డబ్బులు చెల్లించాలంటే రైతు ఏమైపోతాడు? నూకలు ఉన్నాయని చెప్పి ధాన్యాన్ని నిలువరించిన పరిస్థితి ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు అన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వ విధానాలు రైతు మెడలకు ఉరితాళ్లు అయ్యాయి అన్నారు.

ప్రతి ధాన్యం గింజ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటాం. ఎటువంటి నిబంధనలు లేకుండా, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులు కోసం రోడ్డు ఎక్కడం కాదు, తాడేపల్లి రాజప్రసాదాన్ని కూడా ముట్టడిస్తామని తెలియజేశారు.

LEAVE A RESPONSE