Suryaa.co.in

Andhra Pradesh

వై నాట్ 175 నినాదం వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధికి ప్రభుత్వ కుట్ర

– ప్రజల వద్దకు వెళ్లడానికి సంకోచం అక్కర్లేదు
– వాలంటీరు ద్వారా వృద్దులు ఓటు వేయిస్తే అభ్యంతరం చెబుతాం
– కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందొ ఒక్కటీ లేదు.
– గాంవ్ ఛలో అభియాన్ వర్క్ షాప్ ను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ కు బిజెపి జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ హాజరయ్యారు. కార్యక్రమం ఇంఛార్జి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయ్యాజీ వేమ, బిజెపి నేత బాలకృష్ణ తదితరులు వేదిక ను అలంకరించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏమన్నారంటే.. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. రెండు నెలల సమయం కూడా లేదు. పొత్తుల విషయం అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది. పొత్తుల సంగతి కాకుండా పార్టీ బలోపేతం చేయాలి. జిల్లాల అభివృద్ధికి కేంద్రం కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రజల వద్దకు వెళ్లడానికి సంకోచం అక్కర్లేదు. రోడ్లు, వైద్య కళాశాలలు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అన్నింటికీ కేంద్రం నిధులనే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందొ ఒక్కటీ లేదు.

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటోంది. కానీ ఏవేవీ కారణాలతో లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తోంది. గరీభ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఒక్కో పేద లబ్ధిదారునికి 5 కేజీల బియ్యం కేంద్రం ఇస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం కూడా ఎగ్గొట్టింది. దేశమంతా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనను పండుగలా చూశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇవ్వకుండా విద్యార్థులు చూసే అవకాశం చేజార్చింది.

ఓటరు జాబితాల్లో చాలా అవకతవకలు జరిగాయి. వై నాట్ 175 నినాదం వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధికి రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదుతోనే ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఇది భాజపా సాధించిన విజయం. ఒక్క తిరుపతి ఉప ఎన్నికలోనే 35 వేల దొంగ ఓట్లు వేయించారు. 80 ఏళ్ల వృద్ధులకు ఇంటి నుంచే ఓటు హక్కు నిబంధన పెట్టారు. రాష్ట్రంలో వాలంటీరు ద్వారా వృద్దులు ఓటు వేయిస్తే తాము అభ్యంతరం చెబుతాం.

అధికార పార్టీ అభ్యర్ధుల స్థానాలు మారుస్తున్నారు. వారితోపాటు వారి మద్దతు ఓటర్ల జాబితాలూ మారుస్తున్నారు. వేల కొద్ది కొత్త ఓట్లను వేరే నియోజకవర్గాల్లో నమోదు చేస్తున్నారు. దీన్ని భాజపా ఆక్షేపిస్తోంది. ఓటు మార్చుకునే అవకాశాన్ని వైకాపా దుర్వినియోగం చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్ల ద్వారా వృద్ధుల ఓట్లు, వేరే నియోజకవర్గాల్లో కొత్త ఓట్ల నమోదుపై ఫిర్యాదు చేస్తాం.

రాష్ట్రంలో ప్రజలను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఒత్తిళ్లకు గురిచేసి భయపెట్టి లబ్ధి పొందాలనుకుంటోంది. వీటన్నింటిపైనా ప్రజలకు గ్రామాల్లో పర్యటించి వాస్తవాలు వివరించాలి.

LEAVE A RESPONSE