యువతను మేల్కొలిపి ఓటు వేయించిన వ్యక్తి నరేంద్రమోడీ

– భారతీయ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీకృష్ణ

అమరావతి : భారత దేశంలో యువతను మేల్కొలిపి ఓటు వేయించిన వ్యక్తి నరేంద్రమోడీ. కొత్తగా ఓటు వచ్చిన ఓటర్లు 2014, 2019 లో నరేంద్ర మోడీకి వేసిన ఓటు భారత దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప స్థానంలో నిలబెట్టింది. దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర నూతనంగా ఓటు వేసే యువకులదే.

రేపు నూతన ఓటర్ల సమ్మేళనం రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 వేల మంది పాల్గొనబోతున్నారు.. రేపు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా BJYM నేతృత్వంలో మొదటి సారి ఓటు హక్కు పొందిన కొత్త ఓటర్లతో “నమో నా మొదటి ఓటు దేశం కోసం” కార్యక్రమం జరుగుతోంది.

దేశంలోని 5000 ప్రదేశాల్లో ఒకేసారి జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ,bJYM అధ్యక్షులు మిట్టా వంశీ కృష్ణ , మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి , రాజ్యసభ సభ్యులు GVL నరసింహారావు , పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు.

Leave a Reply