Suryaa.co.in

Andhra Pradesh

జనంలో మోదీ.. పరదాల చాటున జగన్

-కేంద్రనిధులు మళ్లిస్తున్న జగన్ సర్కార్
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్
-తాతలు, తండ్రుల పేర్లు పెట్టుకుని బతుకుతున్న వైసిపి
– రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్పయాత్ర రెండవ రోజు గుజ్జనగుండ్ల ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమై మారుతి నగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, ఎల్ఐసి కాలనీ మీదుగా స్తంభాల గరువు రామాలయం వద్ద ముగిసినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ విచ్చేశారు.

ఈసందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ…
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తుంటే సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఆ నిధులు అన్ని దారి మళ్ళిస్తున్నారు. నరేంద్ర మోడీ దేశంలో ఎక్కడికి వెళ్లినా కానీ ప్రజల మధ్య తిరుగుతున్నారని, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాల మాటున తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎయిమ్స్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన ఆసుపత్రి నిర్మాణం పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేసాం. పల్నాడు జిల్లాలో కేంద్రానికి సంబంధించిన విద్యాలయాలు, మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ. ప్రధానమంత్రి అవాస్ యోజనా పధకంలో 176551ఇళ్లమంజూరు, 11914 నీటి కుళాయిలు కనక్షన్స్, స్పైసెస్ పార్క్ అభివృద్ధి కి 2046కోట్లు మంజూరు చేశారు.

ఈ దేశం బాగుకోసం నరేంద్ర మోడీ కి ఏ విధంగా అయితే అండగా ఉన్నారో అలాగే ఈరాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీకి అండగా ఉండాలని కోరారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఈరాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ మాట్లాడుతూ… మోదీ ప్రధాని అయిన పదేళ్లలోనే అందరికీ సంక్షేమ పధకాలు అందేలా చేస్తున్నారు. మహిళలు, యువతకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే, మరో పక్క అభివృధ్ది పై దృష్టి సారిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అసత్యాలతో తమ మనుగడ కోసం పాకులాడుతూ, బిజెపి రాష్ట్రానికేమీ చేయలేదని విమర్శిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఒక్క రైల్వేలకే 89 వేల కోట్లు కేంద్రప్రభుత్వం కేటాయించింది.

అలాగే లక్షా 10 వేల కోట్లతో జాతీయ రహదారులు మన రాష్ట్రంలో అభివృధ్ది చేశాము. మన గుంటూరులో 500కోట్లు ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి కేటాయించాము. పియం కిసాన్, ఫసల్ యోజన వంటి పధకాలతో పాటు యువత, చిరు వ్యాపారుల నిలుదోక్కుకోవటానికై అనేక పధకాలు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది.

మన రాష్ట్రంలో ఎన్ని పధకాలు అమలు చేస్తున్నా, ఏమీ చేయలేదనే వారికి విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర ఒక చెంపపెట్టు లాంటిది. కేంద్ర ప్రభుత్వ పధకాలకు తమ తాతలు, తండ్రుల పేర్లు పెట్టుకుని బతుకుతున్న వైసిపి ప్రజలను వంచిస్తోంది. ప్రజలకు అందుతున్న పధకాలలో వందశాతం కేంద్రం నుండి వస్తున్నవే. ఇవన్నీ తెలుసుకున్న ప్రజలు బిజెపి కి మద్దతు ఇస్తున్నారు. ఓక్కసారి బిజెపి కి అధికారం ఇవ్వండి. అభివృధ్ది అంటే ఏంటో చూపిస్తాం.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్, ఈదర శ్రీనివాసరెడ్డి, శనక్కాయల అరుణ, మాగంటి సుధాకర్ యాదవ్, పాలపాటి రవికుమార్, తులసి యోగేష్, మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, బోలగాని సాంబయ్య, మండల ప్రధాన కార్యదర్సులు దర్శి నరసింహారావు, పెండ్యాల సాంబమూర్తి, ముత్యం నరేంద్ర, మహిళామోర్చా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి యాదవ్, అంకరాజు నరసింహమూర్తి, కోలా రేణుకాదేవి, తోట శ్రీనివాస్, కొక్కెర శ్రీనివాసరావు, వాణి వెంకట్, గోర్ల నాగమల్లేశ్వరి, ఏడుకొండలు గౌడ్, దేసు సత్యనారాయణ, స్టాలిన్, రాయపూడి ఏసోబు, వెంకట్, చంద్రశేఖర్, కుమార్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE