ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

-ఏపీలో ఉపాధ్యాయులను ఉదాహరణగా చూపి తెలంగాణ టీచర్లను హరీష్ రావు భయపెట్టడం.. ఏపీ రాష్ట్ర దుస్థితికి అద్దంపడుతోంది
– ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం ఏం చేసిందని తెలంగాణ మంత్రి వచ్చి పరిశీలించాలి
-ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. శుక్రవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

వైసీపీ ప్రభుత్వం టీచర్ల చేత విద్యాబోధన కంటే మద్యం విక్రయాలు, మరుగుదొడ్ల శుభ్రంపైనే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కరోనా సమయంలో మద్యం షాపుల దగ్గర టీచర్లని కాపలా పెట్టారు. పాఠశాలల్లోని మరుగుడొడ్లన్ని ఫోటోలు తీసి యాప్ లో అప్ లోడ్ చేసే బాధ్యత టీచర్లకి అప్పగించారు.

మధ్యాహ్న భోజన పథకాలు బాధ్యత టీచర్లకే ఉంది. భోధించే పనికన్నా అనవసరమైన బాధ్యతలని ఉపాధ్యాయులకు అప్పగించారు. నాడు – నేడు అని కరోనా సమయంలో కూడ ప్రధానోపాధ్యాయులతో పని చేయించారు. వైసీపీ నేతలు అవినీతి చేస్తే దానికి ప్రధానోపాధ్యాయులన్ని బాధ్యుల్ని చేయటం దుర్మార్గం. కరోనా సమయంలో టీచర్లు చాలా మంది చనిపోయారు. వారిని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వం చెప్పిన విధానంలో పీఆర్సీ, నూతన విద్యా విధానంలో ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలను, విద్యావేత్తలని పిలిచి మాట్లాడే విధానంలో వాళ్లకి అనూకూలంగా జరగలేదనేది వాస్తవం.

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రలో టీచర్ల పరిస్ధితిని చూపించి తెలంగాణ టీచర్లని బయపెట్టడం ఏపీ దుస్దితికి అర్దం పడుతోంది. మంత్రి హరీష్ రావుని ఏపీకి వచ్చి చూడాలని మంత్రి బొత్స అంటున్నారు. ఉపాధ్యాయులకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని తెలంగాణ మంత్రి వచ్చి పరిశీలించాలి? బొత్స చెప్పినట్లుగా మంత్రి హరీష్ రావు ఏపీకి వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడితే రాష్ట్రం పరువే పోతుంది.ఏపీలో తమ పరిస్థితి బాగోలేదని ఉపాధ్యాయ సంఘాలే చెబుతున్నాయి.

నూతన విద్యా విధానం అని అంగన్ వాడీలు, ప్రీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూళ్లన్నంటిని మెర్జ్ చేశారు. అలా చేయటం వల్ల స్కూళ్లు దూరమై చాలా మంది పిల్లలు బడికి దూరమవుతున్నారు. మున్సిపల్ టీచర్ల బాధ్యతని ప్రభుత్వమే తీసుకుంది. ఆ టీచర్లందరిని మెర్జింగ్ ల పేరుతో జిల్లా పరిషత్ పాఠశాలలో కలిపారు. వాళ్లకు జీతాలు లేక మొత్తుకుంటున్నారు. విద్యా వ్యవస్థని మొత్తం అస్థవ్యస్ధం చేశారు. నిజంగానే హరీష్ రావు మన రాష్ట్రానికి వచ్చి నలుగురు టీచర్లతో మాట్లాడితే మన రాష్ట్రం పరువు పోతుంది.

మన రాష్ట్రానికి వచ్చి చూసుకోమ మన పరువు పోయే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో బొత్స సత్యనారాయణ చెప్పాలి. రాష్ట్రంలో టీచర్లు మాత్రమే కాదు, ఉద్యోగస్థులు పరిస్ధితి కూడ చాలా దారుణంగా ఉంది. పీఆర్సీ ఇచ్చాం, రిటైర్మైంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారు. 60 నుంచి 62 ఏళ్లు పెంచమని ఉద్యోగులెవరూ అడగలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. దాని వల్ల ఆర్టీసీ ఉద్యోగులేమైనా సంతోషంగా ఉన్నారా. సిపియస్ పై అవగాహన లేకుండా హామి ఇచ్చామని , దేశంలో ఇంత బహిరంగంగా క్షమాపణ కోరిన నాయకులు వైసీపీ నేతలు తప్ప మరెవరూ లేరు.
కనీసం అర్ధమైన తరువాత అయిన దాన్ని రద్దు చేసే దిశగా మీరు ఏమి చేయలేదు. గ్యారెంటీ పెక్షన్ స్కీం అని జీవో ఇస్తున్నారు. దాని మీద ఉద్యమం చేసిన ఉపాధ్యాయుల పరిస్ధితి ఏంటి. మండలిలో కూడా ఉపాధ్యాయులపై పెట్టిన కేసులు విత్ డ్రా చేయాలని సభ్యులు అడిగితే.. దానికి మంత్రి బొత్స సత్యనారాయణ సిఎం ఇల్లు ముట్టడంటే మేం ఊరుకుంటామా అని సమాధానమిచ్చారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద కక్ష్య పూరితంగా కేసులు పెట్టిందని ఆయన వ్యాఖ్యల్లోనే స్పష్టం అయింది. సీపియస్ రద్దు చేయమని అడిగితే పరిశీలిస్తాం. అది నా శాఖ కాదు హోం మినిస్టర్ చూడాలని సమాధానమిచ్చారు. ఛలో సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే పోలీసు వ్యవస్ధని ఉపయోగించి ఎవరినీ విజయవాడ సరిహద్దుల్లోకి రాకుండా చేశారు.

రిటైర్మైంట్ వయసు గత టీడీపీ ప్రభుత్వం 58 నుంచి 60 ఏళ్లకి పెంచింది. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 2,100 కోట్లు ఉంది, వాటిని ఇప్పుడు మేం ఇవ్వలేం కొంత సమయం కావాలని ప్రభుత్వమే చెప్పింది. చీఫ్ సెక్రటరీ చెప్పిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేటికి ఇవ్వలేదు. ఉద్యోగుల జిపియఫ్ సొమ్ము విత్ డ్రా చేశారని స్వయాన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 5 డీఏలని పిఆర్సిసికి సంబంధించి విడుదల చేశారు. దానికి సంబంధించిన అరియర్స్ మీకు లేవు. రిటైర్మెంట్ అప్పుడు ఇస్తాం అన్నారు. ఎవరికి ఎంత ఇచ్చారనే లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు. ఉద్యోగస్థులు కూడ అడగడం మానేశారు.

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులని పర్మినెంట్ చేయడానికి కమిటీ వేసి జీవో ఇస్తే, దానిపై హైకోర్టు క్లియరెన్స్ ఇస్తే ఆ దిశగా తెలంగాణ సాగుతుంది. మన ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటూ మంత్రులు కమిటీ అని వేశారు. కమిటీలతో కాలయాపన చేస్తున్నారు తప్ప ముందుకు సాగడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాధానం చెప్పే వ్యవస్థ ఉండాలి కనుక ఆప్కాస్ అని పెట్టారు. ఉద్యోగులకు అక్టోబర్ నెల జీతాలు నవంబర్ 1 లో వస్తాయి. ఆప్కోస్ లోని 99వేల ఉద్యోగులకు ఏ నెలలోను పూర్తి జీతాలను చెల్లించలేదు.

సగం జీతం చెల్లించి మిగిలిన 25శాతానికి రెండు, మూడు నెలలకి ఒకసారి జీతాలు ఇవ్వడం. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కంబైన్డ్ గా పిఆర్సీకి అప్లైం చేశాం కాబట్టి ఒకే పిఆర్సీ తీసుకున్నాం. తరువాత పీఆర్సీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వేసుకున్నారు. వాళ్లకి ఐఆర్ ఇవ్వలేదు మనికి ఇచ్చారు. వాళ్లకి ఫిట్మెంట్ ఎక్కువ ఇస్తే మనకి తక్కువ ఇచ్చారు. ఢిల్లీ సమావేశంలో విభజనకు సంబంధించి ఏ ఒక్క విషయంలో తెలంగాణ మనకు సహకరించలేదు. విద్యుత్ శాఖ బిల్లులు, విభజన చట్టంలోని షెడ్యూల్డ్ 9,10 ఆస్థి పంపకంలో ఏ ఒక్క విషయంలో తెలంగాణ సహకరించలేదు. నూతన విద్యా విధానం పేరుతో బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా అమలు చేయని విధానాలు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.

జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు వెంకట్రామి రెడ్డి ఉద్యోగుల సంఘం ప్యానెల్ లో పోటి చేసి ఓడిపోతే కోర్టుకు వెళ్లి మరి స్టే తెచ్చారు. కానీ రిజల్ట్ ని తారుమారు చేయలేకపోయారు. అధికార అహకారంతో ఉద్యోగస్థులని కంట్రోల్ చేయలనుకుంటే సమయం వచ్చినప్పడు తగిన బుద్ధి చెబుతారు. ఉద్యోగులకు ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు బాకీ ఉంది అవి చెల్లించాలి. ఉద్యోగుల మోసం చేసినందుకు జగన్ రెడ్డికి ఉద్యోగుల నుంచి ఖచ్చితంగా రిటర్న్ గిప్ట్ ఉంటుందని అశోక్ బాబు అన్నారు.

Leave a Reply