Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రిలే నిరహారదీక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళనలు 23వ రోజూ కొనసాగాయి. చంద్రబాబు వెంటనే విడుదల కావాలని కోరుకుంటూ విశాఖ తూర్పు నియోజకవర్గంలో మరల జగన్ లాంటి సైకోకు రాష్ట్రన్ని అప్పగిస్తే ప్రజలు అడుక్కొని బతకాల్సిందే అని రోడ్డుపై వాహనదారులను భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డా బి వి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో గోనెగండ్ల గ్రామంలో దశమి సందర్భంగా చింతలముని నల్లారెడ్డి స్వామీని దర్శించుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని కోరుకున్నారు. టీడీపీ, జనసేన నాయకులు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదోని నియోజకవర్గంలో ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఈడిగ గౌడ కులస్తులు దీక్షలో కూర్చున్నారు.

గౌడ కులస్థులు కల్లుముంతలు, ఈత చెట్టు కొమ్మలుతో ముంతలకు బాబు కోసం మేము సైతం అంటూ అక్షరాల రూపంలో రాసుకొని బాబు గారికి మద్దతుగా వినూత్నంగా నిరసన తెలిపారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో పూసపాటిరేగ మండలం బర్రెపేట గ్రామం బర్రిపేట సముద్రంలో పడవల మీద నిలబడి టీడీపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.

కొత్తపేట నియోజకవర్గంలో ఇంఛార్జ్ బండారు సత్యానందరావు ఆద్వర్యంలో 23వ రోజు రావులపాలెం నందు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రైతులు కూరగాయలతో, చిరు వ్యాపారులు పూతరేకులుతో ఐ యామ్ విత్ సిబిఎన్ అని చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపారు. ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. గిద్దలూరులోని క్లబ్ రోడ్డులో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి.

అర్ధవీడు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శనతో, నోటికి నల్ల బ్యాడ్జిలను కట్టుకొని మేము సైతం బాబు కోసం అంటూ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ వీరయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

చదలవాడలో దీక్ష చేస్తున్న వీరయ్యను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వీరయ్య 4 రోజులుగా దీక్ష చేపట్టారు. అద్దంకి నియోజకవర్గం రావినూతలలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రావినూతల నుంచి రాచపూడి వరకు 10 కి.మీ మేర సైకిల్ యాత్ర చేపట్టగా భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బూర్యో సభ్యులు గోరింట్ల బుచ్చియ్య చౌదరి, బొండా ఉమామహేశ్వరరావు, రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి, వంగళపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగధీశ్వరరావు, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవి ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, బి.కె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహాయాదవ్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, పిజి.వి.ఆర్ నాయుడు(గణబాబు), నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ళ జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్ రావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలా వీరాంజనేయస్వామి, మాజీ మంత్రులు, దేవినేని ఉమా, కొండ్రు మురళీ మోహన్, గొల్లపల్లి సూర్యరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మినారాయణ, నక్కా ఆనందబాబు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE