Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి ప్రమేయంతోనే చేబ్రోలు మండలంలో గ్రావెల్ తవ్వకాలు

మొత్తం 6 గ్రామాల పరిధిలో తవ్వకాలు
దాదాపు 500ఎకరాల పరిధిలో గ్రావెల్ తవ్వకాలు
ఎమ్మెల్యే కిలారు రోశయ్య కనులన్నలలో గ్రావెల్ మైనింగ్
టన్ను రూ.110 చొప్పున ఆ ప్రాంతంలో తవ్విన గ్రావెల్ విలువ 2వేల 200 కోట్లు
గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో దూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో గ్రావెల్ తవ్వకాలు ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. వైసిపి వచ్చాక ఇప్పటి 200 కోట్ల టన్నుల గ్రావెల్ అక్కడి నుంచి అక్రమంగా తరలించారు.దాదాపు 500ఎకరాల పరిధిలో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.

మొత్తం 6 గ్రామాల పరిధిలో తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రావెల్ తరలింపు వాహనాలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి.స్థానికులు ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.పోలీసుల అండదండలతో ఈ దందా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కనులన్నలలో గ్రావెల్ మైనింగ్ జరుగుతోంది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగే అవకాశం లేదు.

టన్ను రూ.110 చొప్పున ఆ ప్రాంతంలో తవ్విన గ్రావెల్ విలువ 2వేల 200 కోట్లు.కలెక్టర్ సహా అధికారులకు దీనిపై ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదు.దీన్ని బట్టి ముఖ్యమంత్రి కి ఈ విషయంలో సంబంధం ఉందని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మూడుసార్లు సీఎంను కలిశారు. కప్పం కట్టించి కోవటానికే సీఎం ఎమ్మెల్యేను పిలిపించారని అర్థమవుతోంది.

తవ్వకాలు అడ్డుకుని ఆందోళన చేసిన వారిని పోలీసులు అర్థరాత్రి సమయంలో తుపాకులతో బెదిరిస్తున్నారు.పంచాయతీ చెరువులను కూడా ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్నారు. కనీస నిబంధనలను పట్టించుకోకుండా లోతుకు తవ్వుతున్నారు. ముఖ్యమంత్రి ప్రమేయం తోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయి.

LEAVE A RESPONSE