• నాయీబ్రాహ్మణులను జగన్మోహన్ రెడ్డి నిలువునా వంచిస్తున్నాడు
• టీడీపీ హయాంలో బార్బర్ దుకాణాలుపెట్టుకున్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి రూ.10వేల ఆర్థిక సహాయ అందితే, ఈ ముఖ్యమంత్రి అరకొరగా కొద్దిమందికే సాయంచేసి, చేతులుదులుపుకున్నాడు
• కడపజిల్లా బద్వేల్ లో నాయీబ్రాహ్మణ యువతిపై హత్యాచారంజరిగితే జగన్మోహన్ రెడ్డి ఆమెమానప్రాణాలకు రూ.5లక్షల ఖరీదు కట్టాడు
– నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు
బీసీలు తనకు వెన్నెముక అని నమ్మించి, వారిఓట్లతో అధికారంలోకివచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అదేవెన్నెముకను విరిచేశాడని, స్వర్గీయ ఎన్టీఆర్ బీసీలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహిస్తే, ఈ ముఖ్యమంత్రి ఆ రిజర్వేషన్లను 22శాతా నికి తగ్గించి బడుగుబలహీనవర్గాలకు దక్కాల్సిన దాదాపు 16వేలకు పైగా పదవుల్ని వారికి కాకుండా చేశాడని, టీడీపీ క్రమశిక్షణా సంఘంసభ్యులు, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
దేశంలో ఇప్పుడు బీసీజనగణన అవసరంలేదని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ప్పుడు, జగన్మోహన్ రెడ్డి గానీ, ఆయనపార్టీ ఎంపీలుగానీ, కేంద్రాన్ని నిలదీయకుండా నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరించారు. పార్లమెంట్ లో నోరెత్తని అధికారపార్టీ, రాష్ట్రంలోని బీసీలకు భయపడి, వారిని మోసగించడానికి తమప్రభుత్వం బీసీజనగణనకు అనుకూలమని తీర్మా నం చేయడం జరిగింది. బీసీకులాల లెక్కలు ఉంటేనే, ఆయా వర్గాలకు అభివృద్ధిఫలాలు అం దుతాయని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, బీసీజనగణన జరపాల్సిందేనని కేంద్రం పై ఎందుకు ఒత్తిడిచేయలేకపోతోంది?
చంద్రబాబునాయుడి ప్రభుత్వం బీసీ విద్యార్థులకోసం విదేశీవిద్యను తీసుకొచ్చి, లక్షలరూపాయల ఆర్థికసహాయం చేస్తే, జగన్ అధికారంలోకివచ్చా క దాన్ని నిలిపేశాడు. విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన బీసీవిద్యార్థులు నేడు వివిధ దేశాల్లో నానాఅవస్థలు పడే దుస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. పెళ్లికానుక పథకం కింద బీసీయువతులకు చంద్రబాబునాయుడి హాయాంలో రూ.35వేలనుంచి రూ.50వేలవరకు ఆర్థికసహాయం చేస్తే, ఆపథకాన్నికూడా ఈ ముఖ్యమంత్రి అటకెక్కించాడు. బీసీలకు దక్కాల్సిన బ్యాక్ లాగ్ పోస్టులభర్తీని ఈ ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించాడు.
అన్నివర్గాలకు సమానంగా రిజర్వేషన్లు అమలుచేసి, ఆయాపోస్టులను భర్తీచేయకుండా, కాంట్రాక్ట్ ప్రాతిపదికన తాను అనుకున్నవారికే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తున్నాడు.రూ.లక్షవరకు సబ్సిడీ రుణాలు అందించే బీసీకులాల కార్పొరేషన్లను కూడా జగన్మోహన్ రెడ్డి మూతపడేలా చేశాడు. బీసీల్లో ఏవర్గానికి కూడా ఆర్థికచేయూత అందేఅవకాశంలేకుండా చేసి, తూతూమంత్రంగా కేవలం కొన్నివర్గాలకే
రూ.10వేలుఇస్తూ జగన్మోహన్ రెడ్డి , బీసీల్లోని అనేకవర్గాలను వంచిస్తున్నాడు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు బీసీల్లో బాగావెనుకబడిన నాయీబ్రాహ్మణులకోసం ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటుచేస్తే, గత ప్రభుత్వంలోచంద్రబాబునాయుడు సదరు ఫెడరేషన్ కు సరిపడినన్ని నిధులిచ్చి, నాయీబ్రాహ్మణులకు అన్నివిధాలాఅండగా నిలిస్తే, ఈ ముఖ్యమంత్రి నాయీబ్రాహ్మణ ఫెడరే షన్ నే నిర్వీర్యంచేశాడు.
టీడీపీ హయాంలో బార్బర్ షాపులు పెట్టుకున్న ప్రతి నాయీబ్రాహ్మ ణుడికి చంద్రబాబునాయుడు గారు రూ.10వేలవరకు ఆర్థికసహయం అందిస్తే, ఈముఖ్యమంత్రి అరకొరగా కొందరికే చేయూతకింద ఆర్థికసహాయంచేసి, చేతులుదులుపు కున్నాడు. దేవస్థానాల్లో క్షురకర్మలు నిర్వహించే నాయీబ్రాహ్మణ సోదరులకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కో టికెట్ కు రూ.25చొప్పున ఇస్తే, వారిని పర్మినెంట్ చేస్తాననిచెప్పిన జగన్మోహన్ రెడ్డి, చివరకు వారికిచ్చే దానిలోకూడా కోతపెట్టాడు. దేవస్థానాల్లో డోలు, నాదస్వరం, కళాకారులుగా పనిచేసే నాయీబ్రాహ్మణులపై వివక్షచూపిన ఈ ముఖ్యమంత్రి కేవలం రూ.5వేలను కరోనా సమయంలో అప్పుగా ఇచ్చి వారిని అవహేళనచేశాడు.
చంద్రబాబునాయుడు నాదస్వరం, డోలు కళాకారులకు సంగీతపాఠశాలల్లో ఉపాధి కల్పించారు. ఆ క్రమంలో జీవోనెం 24 తీసుకొచ్చి రాష్ట్రంలోని ప్రధానదేవాలయాల్లో వేదం నాదం సమానంగా ఉండేలా ప్రాధాన్యతఇస్తే, ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు ఆ జీవోను అమలు చేయలేదు. బీసీలకు, మరీముఖ్యంగా నాయీబ్రాహ్మణులకు తీరనిఅన్యాయం, ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పురవీధుల్లో అడ్డుకునే శక్తిగా అవతరించి, ఆయన రాజకీయజీవసమాధి కట్టే వారిగా తయారవబోతున్నాం.
జగన్మోహన్ రెడ్డి సమాధి నిర్మాణానికి బేలుదారీ పనివాళ్లమై,ఆయన వికృతపోకడలను అడ్డుకొనే తీరుతాం. కడపజిల్లా బద్వేల్ లో శిరీష అనే నాయీబ్రాహ్మణ యువతిపై హత్యాచారం జరిగితే, ఆమెకుటుంబానికి ఈ ముఖ్యమంత్రి మొక్కుబడిగా రూ.5లక్షలు ఇచ్చి చేతులుదులుపుకున్నాడు. ఆఖరికి మానం, ప్రాణంకోల్పోయిన నాయీబ్రాహ్మణ స్త్రీలన్నాకూడా జగన్మోహన్ రెడ్డికి చిన్నచూపే అని తేలిపోయింది. రాష్ట్రంలోఉన్న అన్నిబీసీకులాలకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటుచేసి, సరిపడినన్ని నిధులుకేటాయించాలని, రాజకీయాల్లో బడుగు, బలహీనవర్గాల వారికి 33శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని బీసీలతరుపున డిమాండ్ చేస్తున్నాం.