– ద్వితీయ, తృతీయ స్థానాల్లోనూ గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎడ్ల జతలే
– తొమ్మిది మంది విజేతలకు రూ.1.79 లక్షల నగదు బహుమతులు అందజేసిన రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని
గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్లో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీల్లో భాగంగా రెండు పళ్ళ విభాగంలో గుంటూరు జిల్లా పురుషోత్తపట్నానికి చెందిన షేక్ సత్తార్, మతుకుమిల్లికి చెందిన ముండ్రు జీవప్రసాద్ ఎడ్ల జత , ప్రకాశం జిల్లా పోట్లపాడుకు చెందిన పాలం వెంకటేశ్వరరెడ్డి ఎడ్ల జత నిర్ణీత సమయంలో 3,900 అడుగుల దూరాన్ని లాగి ప్రథమస్థానంలో నిలిచాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. రెండు పళ్ళ విభాగంలో మొదటి తొమ్మిది స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.1.79 లక్షల నగదు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి రెండు పళ్ళ విభాగంలో పోటీ పడేందుకు 19 ఎడ్ల జతలు వచ్చాయన్నారు. గుంటూరు జిల్లా ఈమన దుగ్గిరాలకు చెందిన అంబా సురేష్, పత్తిపాడుకు చెందిన కాకాని సురేష్ బాబు ఎడ్ల జత 3,650.11 అడుగుల మేర బండను లాగి ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మారెళ్ళ గుంటపాలేనికి చెందిన నల్లూరి శ్రీనివాసరావు ఎడ్ల జత 3,410.9 అడుగుల దూరాన్ని లాగి తృతీయ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామానికి చెందిన కొలుసు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావుల ఎడ్ల జత
3,371 అడుగుల మేర బండను లాగి నాల్గవ స్థానంలో, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్ళపాడుకు చెందిన తిరుమలశెట్టి నరేంద్ర ఎడ్ల జత 3,333.6 అడుగుల దూరం లాగి ఐదవ స్థానంలో, కర్నూలు జిల్లా పాములపాడు మండలం తుములూరుకు చెందిన టీ సురేష్ ఎడ్ల జత 3,300 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో, గుంటూరు జిల్లా ఎడ్లపాడుకు చెందిన కల్లూరి ప్రణీత చౌదరి, కుంకలగుంటకు చెందిన పల్లగిరి లిఖితేశ్వర్ ఎడ్ల జత 3,176 అడుగుల దూరం లాగి ఏడవ స్థానంలో, ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చింతగుంటపాలేనికి చెందిన తాటిపత్రి పావని ఎడ్ల జత 3,002.5 అడుగుల దూరం లాగి ఎనిమిదవ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.30 వేలు , రూ .30 వేలు, రూ.25 వేలు, రూ.22 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు , రూ .13 వేలు , రూ .10 వేలు, రూ. 8 వేల నగదు బహుమతులను మంత్రి పేర్ని నాని అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ వైసచైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.