హిమాలయాలలో 8 నెలలు నరసంచారం ఉండని,కాని అన్నిసమయాలలో కొద్దిమంది యోగులు మాత్రమేధ్యాన సమాధిలో ఉండే ప్రదేశమే ”జ్ఞానగంజ్ ” . తినటానికి బంగాళాదుంపలు మాత్రమే లభిస్తాయి చిన్న చిన్న కర్ర ఇళ్ళు మాత్రమే నివాసానికి ఉపయోగపడేవి గా ఉంటాయి .ఈ ప్రదేశం లో ఇండియన్ ,టిబెటన్, నేపాలీ సాధు వులు మాత్రమే ఉంటారు ఈ యోగులు హిమాలయ సరిహద్దులో టిబెట్ ,పితోరా ఘర్ లమధ్య ఉంటారు .
ఈ ప్రదేశానికి తప్ప ప్రపంచం లో మరే ప్రదేశానికి జ్ఞానగంజ్ అనే పేరు లేదు. ఒక్కొక్కసారి అత్యధిక హిమపాతం మంచు చరియలు విరిగి పడటం జరిగి భయానకంగా ఉంటుంది . దేవతల సాయంతోనే వెళ్ళగలం . దారిలో ”రాక్షస స్థలం ”ఉంది ఇక్కడ ఉన్న సరస్సుకు రాక్షస సరస్సు అని పేరు. అకస్మాత్తుగా మంచు కొండలు విరిగి హిమానీ నదాలు విజృంభించి నీటి మట్టం ఉవ్వెత్తున పైకి ఎగసిపడుతుంది .ఒక రోజు బాగుందికదా అను కొంటే, మర్నాడు భీభత్సం సృష్టిస్తుంది .బ్రతుకు దైవా దీనం అని నమ్మి ధైర్యంగా ముందు అడుగు వేయాలి .
మన మంత్రాలకు అక్కడ చింతకాయలు రాలవు . మన ప్రార్ధనలు అక్కడ పని చేయవు ..ఒక్కోసారి కొన్ని రోజులపాటు తినటానికి ఏమీ దొరకదు . దివ్య జీవులు మాత్రమే చక్కగా మనల్ని అక్కడికి తీసుకు వెళ్ళగలరు .. ఒకసారి స్వామి రామాకు దారి చూపించిన అతను, దగ్గరలోనే ఆగ్రామం ఉందని చెప్పి అకస్మాత్తుగా అదృశ్య మయ్యాడు .ఇలాంటి సంఘటనలు ఈ దేవ భూమిలో సహజమే ..రామాతో వచ్చిన బృందం ఇక సాహసం చేయ లేక వెనక్కి వెళ్ళిపోతే.. రామా ఒక్కడే జ్ఞాన గంజ్ వైపుకు నడిచి వెళ్ళాడు.
అక్కడున్న ఒక సాధువు ఆశ్రయమిస్తే నెలన్నర అక్కడ గడిపాడు .ఈ ప్రదేశం భుట్టో ఎత్తైన హిమ శిఖరాలున్నాయి .అవి మబ్బులతో దోబూచు లాడుతూ పరమ రమణీయంగా కనిపించాయి .ఇంతటి అందమైన ప్రదేశం పృథ్వి లో ఎక్కడా చూడలేము . జ్ఞానగంజ్ నుంచి తిరిగి వస్తూ కైలాస పర్వతానికి కిందభాగం లో ఉన్న మానస సరోవరం దగ్గరకు నడుచు కుంటూ చేరాడు .
అక్కడ కొందరు భారతీయ టిబెట్ యోగులు కలిశారు .లామాలతో కొన్ని వారాలు ఉన్నాడు .అక్కడ గొర్రెలు మేపే వారితో కలిసి నడిచాడు .వాళ్ళు ఈ దేవ భూమి ని గురించి అనేక కధలు గాధలు చెప్పారు .వీళ్ళే దేవతలు .ఈ దేవతలు జ్ఞాన అజ్ఞాన జీవితం అంచున సంచరిస్తూ ఉంటారు.వీరు తీవ్ర సాధకులకు భౌతికంగా దృశ్యమానమై మార్గ దర్శనం చేస్తారు .కానీ వాళ్ళు అభౌతిక తలం (నాన్ ఫిజికల్ ప్లేన్ ) లోనే ఉంటారు . వారి ఉనికికి తగిన తలం ఉంటుంది .రహస్య (ఈసోటెరిక్ )సైన్స్ ,తాంత్రిక శాస్త్రాలు ఈ రహస్య జీవుల గురించి విస్తృతంగా వివరించాయి .
ఆధునిక శాస్త్ర వేత్తలు వీటిని కాకమ్మ కబుర్లుగా తోసి పారేస్తున్నారు .కానీ శాస్త్ర వేత్తలు జీవితం లో అన్ని పార్శ్వాలపైనా పరిశోధనలు ఇంత వరకు చేయలేదు .మెదడు దాని లోపలి ప్రదేశాలపైనమాత్రమే చేసారు .కానీ మానసిక శాస్త్రం లోపారమార్ధిక లేక ఇంద్రియాతీత సైకాలజీ పై దృష్టిపెట్టలేదు ..ఇది నేటి ఆధునిక శాస్త్రవేత్తలకు అందని విషయం . శాశ్వత సైకాలజీ (పెరె న్నియల్ సైకాలజీ ) శతాబ్దాల నుండి మన ప్రాచీనులు,మహర్షులు చెబుతూనే ఉన్నారు .
ఇదే సరైన అసలైన విజ్ఞానం .అది జ్ఞానం లో అత్యున్నత శ్రేణికి చెందిన అంటారు. దృష్టి లేక అంతశ్చేతన.. భౌతిక విజ్ఞాన శాస్త్రా లకు పరిమితి ఉంది .వాటి పరిశోధనాఫలితాలు పదార్ధ బాహ్య విషయం పైనా , శరీరం ,మెదడు పైన మాత్రమే ఉన్నాయి అంతకు మించి లోతు వాళ్లకు తెలియదు.
– రవీంద్రనాథ్ మంతా