Suryaa.co.in

Telangana

ఘనంగా పద్మారావు గౌడ్ జన్మ దిన వేడుకలు

– శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు

సికింద్రాబాద్ శాసనసభ్యుడు, బీ.ఆర్.ఎస్. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ జన్మ దిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ లోని పద్మారావు గౌడ్ నివాసం నేతలు, కార్యకర్తలతో సందడిగా మారింది. తొలుత బంజారా హిల్స్ లోని తెలంగాణా భవన్ లో నగరానికి చెందిన ఎం ఎల్ ఏ లు, నేతల సమక్షంలో పద్మారావు గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచడంతో పాటు పద్మారావు గౌడ్ గౌడ్ ను ఘనంగా సత్కరించారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎం.ఎల్.ఏ. మాగంటి గోపీనాద్, ఎం ఎల్ ఏ లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నేతలు డాక్టర్ దసోజు శ్రవణ్, విప్లవ కుమార్, మన్నే గోవర్ధన్ రెడ్డి లతో పాటు కార్పొరేటర్లు, నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లతో పాటు పలువురు ప్రముఖులు పద్మారావు గౌడ్ కు టేలిఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోండా మార్కెట్ లోని తన నివాసంలో పద్మారావు గౌడ్ ను కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. వివిధ డివిజన్ల లో నేతలు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

 

LEAVE A RESPONSE