అందమైన పంచెకట్టు
అబ్బో..పాలనురుగు తెలుపు
తేట తెలుగు..
మాట ధాటీ..
ఏ ప్రాంతానికెళ్తే ఆ యాస..
అందులో ఇంపైన ప్రాస..
గొంతు గంభీరం…
గెటప్పు..సెటప్పు
ఎస్వీఆరే రమారమి..
చుట్టేసాడు భూమి..
చెడు వైపు చూస్తాడు గుడ్లురిమి..
తప్పు మాటాడితే
మాటలతోనే వెంటాడుతాడు
తరిమి..తరిమి..!
ముప్పవరపు వెంకయ్యనాయుడు..
చవటపాలెంలో పుట్టిన మేధావి..
మనిషి నిలువెల్లా
తెలుగు తావి..
పూవు పుట్టినప్పుడే పరిమళం..
కళాశాల రోజుల్లోనే
ఉరకలెత్తింది
గంభీరమైన ఆ గళం..!
ఎమర్జెన్సీ చీకటి రోజులు..
అకృత్యాలే నిత్యకృత్యాలు..
అప్పుడు గర్జించింది సింహం
జైలుకు వెరవక..
బెదరింపులకు లొంగక..
ఎవరికీ జడవక!
అబ్బురపరిచే ఉపన్యాసాలు..
కట్టిపడేసే పదవిన్యాసాలు..
పదాల పదనిసలు..
విమర్శల గసగసాలు..
సభల్లో మాటల రభస..
విపక్షాల రసాభాస..
మొత్తంగా మాటల సమోసా..
కొందరు సూడో మేధావులకు
వాటి అర్థమైనా తెలుసా..!?
అన్నీ బాగున్నాయి..
పదవులెన్నో వరించాయి..
వాజపేయికి హితుడై..
అద్వానీకి సన్నిహితుడై..
కమల వికాసానికి
తానే ప్రభాత కిరణమై..
పొద్దల్లా రణమై..
నిప్పు కణమై..
తెలుగుతల్లి కంఠాభరణమై..
విరాజిల్లిన తెలుగు తేజం..
నీతినిజాయితీలే ఇజం..
అత్యున్నత పదవికి
అడుగుదూరంలో ఆగిపోతే..
తల్లడిల్లిపోదా
తెలుగు గుండె..
ఇదేమి చోద్యమని..
ఇంత సేవకూ
ఆ మహనీయునికి
ఇదేనా నైవేద్యమని..!?
వెంకయ్యనాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286