Suryaa.co.in

Family

మెదడు మైదానం

లిప్త లిప్తకు జారిపోయే
పాదరసం లాంటి కాలంతో
మనసులోని కోర్కెలు
గుర్రాలై పరిగెత్తటం
మానవ నైజం….!!

మించిపోయే కాలంలో
గడిచిపోయేది
మనిషి ఆయుర్దాయమని
విశ్వసించి….

మననుండి
అన్నీ చేజారిపోయిన తర్వాత
బాధ పడేకంటే….

ఏ కాలానికి ఎలా ప్రవర్తించాలో
“మెదడు మైదానంలో”
ఆలోచించాలి…!!

సంకల్ప సాధన,చిత్తశుద్ధితో
కాలాన్ని సద్వినియోగం
చేసుకోవాలి.!!

తామరాకు మీద నీటిబొట్టులా
ఉండీ లేనట్లుగా జీవించాలి
సహజ జ్ఞాని అనిపించుకోవాలి…!!

– నలిగల రాధికా రత్న

LEAVE A RESPONSE