Suryaa.co.in

Andhra Pradesh

వరుపుల రాజాపై అక్రమ కేసులతో వేధింపులు

– ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణిచివేసే కుట్ర
– శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు

ప్రజా సమస్యలపై స్పందించే నాయకుల మీద దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇళ్లు కూల్చడం వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం మంటగలిపింది. ప్రజలు వరదల్లో కొట్టుమిట్టాడుతుంటే రక్షించే చర్యలు చేపట్టకుండా అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలను వేధిస్తూ బురద రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రత్తిపాడు ఇన్‌చార్జ్‌ వరుపుల రాజాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.

వరుపుల రాజా డీసీసీబీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డాడంటూ వైసీపీ నేతలు ఫిర్యాదులు చేసి 51 విచారణలు జరిపించినా గానీ ఎటువంటి అక్రమాలు నిరూపించలేకపోయారు. 2013`19 మధ్య కాలంలో జరిగిన ఆడిట్‌ నివేదికలో కూడా ఎటువంటి అక్రమాలు జరగలేదని నిర్ధారించడం జరిగింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కూడా దీనిపై విచారణ జరిగి వరుపుల రాజాపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సెప్టెంబర్‌ 7, 2020న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా విచారణ పేరుతో వరుపుల రాజాను వేధించడం దుర్మార్గం.

LEAVE A RESPONSE