దున్నపోతు పాలన కారణంగానే ఈ అవస్థలు

Spread the love

– ఎపిలో పరిస్థితులు శ్రీలంక కంటే దారుణం
–  ఒక్క ఇల్లు ముంపు బాధితులకోసం కట్టారా?
– అయోధ్య లంకలో సమస్యలు చెప్పవద్దని వాలంటీర్లను బెదిరించారు
– పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

నాసిక్ లో పుట్టిన గోదావరి సముద్రంలో కలిసే వరకు పూర్తి పర్యవేక్షణ ఉంది. ప్రవాహాలపై రికార్డులు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ రికార్డుల ఆధారంగా నదీ నిర్వహణ. పైనుంచి వచ్చే వరద, ఇక్కడ పడే వర్షం లెక్కించి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఏపీ ప్రభుత్వం సిడబ్ల్యుసి ఇచ్చే హెచ్చరికలు కూడా ఫాలో అవ్వలేదు. అనుకోకుండా ఫ్లడ్ రాలేదు…ముందుగా అన్ని సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కనీసం ఇప్పటికీ మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి అయోధ్య లంకలో ఉంది. నాయకుడు అనే వాడు లీడ్ చెయ్యాలి…కానీ ఎపి సిఎం కనీసం స్పందించలేదు. సిఎం గాల్లో తిరిగాడు…అది కూడా ఈ రూట్ లో పోతూ వరదను గాల్లోనుంచి చూశాడు.

సిఎం గాల్లో తిరుగుతూ…ప్రజలను బుదరలో ముంచాడు.వరదలకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సర్వసన్నద్దంగా ఉండాలి. కానీ అదీ జరగలేదు.25 కేజీల బియ్యం ఇస్తాను అన్నారు…ఎంత మందికి ఇచ్చారు. మత్స్య కారులకు ప్రభుత్వ చర్యల కారణంగా ఇబ్బందులు పెరిగాయి.మత్స్య కారులు నదుల్లోimage-1 ఇసుక తెచ్చుకునే అవకాశం లేకుండా చేశారు. ముంపు గ్రామాల్లో ప్రజలు అడవుల్లో తల దాచుకునే పరిస్థితి వచ్చింది.హెలికాఫ్టర్ లతో ఆహారం అందించవచ్చు. కానీ ఆ ప్రయత్నం చెయ్యలేదు. టిడిపి హయాంలో పొలాల్లో ఇసుక మేటలు వేస్తే కూడా తొలగింపుకు సాయం చేశాం.రాష్ట్రం ఏమీ సాయం చెయ్యకుండా కేంద్రానికి ఎలా ప్రతిపాదనలు పెడుతుంది.

అంచనాలు రూపొందించి…తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో ప్రభుత్వం విఫలం. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రణాళిక ప్రకారం పని చేస్తే కష్టాలు, నష్టాలు తగ్గుతాయి. ప్రతి బాధిత కుటుంబానికి 10 వేలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణలో 10 వేల సాయం ఇచ్చి….పక్కన ఉన్న విలీన గ్రామాల్లో 2 వేలు ఇస్తే ఏంటి అర్థం? విలీన గ్రామాల ప్రజలు అక్కడ పడి ఉండాలి అనుకుంటున్నారా?

రాష్ట్రంలో ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి 10 వేల ఆర్థిక సాయం చెయ్యాలి. ఇల్లు పూర్తిగా దెబ్బతింటే 50 వేల ఆర్థిక సాయం..పాక్షికంగా దెబ్బతింటే 10 వేలు ఇవ్వాలి. వరికి హెక్టార్ కు 25 వేలు, ఆక్వాకు 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి. వరదలో చనిపోయిన వారికి 10 లక్షలు ఇస్తాం అన్నారు…వారికిimage 10 లక్షలు ఇవ్వండి. చనిపోయిన ఆవు లేదా గేదెకు 40 వేలు ఇవ్వాలి. ఆయోధ్య లంకలో బ్రిడ్జి నిర్మాణం చెయ్యాలి….అప్పన పల్లి, పెదపట్నంలో కాజ్ వేల నిర్మాణం చేపట్టాలి. ఎంత చెత్త ప్రభుత్వం అంటే స్లూయిస్ ల నిర్వహణ కూడా చేపట్టలేదు. కరకట్టలు దెబ్బతింటే…ఆయా గ్రామాల ప్రజలే కరకట్టలు పటిష్టపరుచుకున్నారు. కరకట్ట ప్రాంతంలో ఇసుక బస్తాలు కూడా అందివ్వలేదు.

చివరికి బోట్ లలో ప్రజలను దాటించిన యజమానులకు కూడా డబ్బులు ఇవ్వలేదు.ప్రభుత్వం అంటే విశ్వసనీయత అనేది లేకుండా చేశారు. రైతులు మద్దతు ధరలేక వ్యవసాయం మానేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కనీసం డబ్బులు ఇవ్వ లేదు. జగన్ తండ్రి చనిపోతే 5 ఏళ్లు ఓదార్పు యాత్ర చేశారు….ఓట్ల కోసం పాదయాత్ర చేశారు.వరద బాధితులను మాత్రం గాల్లో వదిలేశారు.

ఎపిలో పరిస్థితులు శ్రీలంక కంటే దారుణంగా ఉన్నాయి. శ్రీలంక ప్రభుత్వ అప్పుల కారణంగా ఒక్కో వ్యక్తిపై లక్ష అప్పు…..ఎపిలో ఒక్కొ వ్యక్తిపై 1.70 లక్షలు పన్నులతో బాదుతున్నారు….అప్పులకు అప్పులు చేస్తున్నారు. ఎపిలో ప్రజలు సహనంతో ఉన్నారు కాబట్టి…..ఇంకా తిరుగుబాటు చెయ్యలేదు. అయోధ్య లంకలో సమస్యలు చెప్పవద్దని వాలంటీర్లను బెదిరించారు. ఈ ప్రభుత్వం వల్ల పోలవరం ప్రాజెక్టు కూడా బలి అయిపోయింది. 72 శాతం పని పూర్తి అయిన ప్రాజెక్టును నాశనం చేశారు. జూన్ 2020 కి నీళ్లు ఇవ్వాల్సిన ప్రాజెక్టును నట్టేట ముంచేశారు.

7 నెలల పాటు ప్రాజెక్టు వద్ద కాంట్రాక్టు సంస్థ లేదు…అధికారులు లేరు. కాంట్రాక్టర్ ను మార్చవద్దని పిపిఎ స్పష్టంగా చెప్పింది. కేంద్రం హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం వల్లనే పోలవరం పూర్తి కావడం లేదని కేంద్రం చెప్పింది.లోయర్ కాఫర్ డ్యాం ద్వారా రివర్స్ లో గోదావరి నీరు వచ్చి రెండు కాఫర్ డ్యాంల మధ్యలో చేరింది. ఆ నీళ్లు ఎలా తొలగిస్తారు…ఎలా పనులు మొదలు పెడతారు. ముంపు ప్రాంతాల్లో ఆర్ అండ్ ఆర్ కింద 10 లక్షలు ఇస్తాను అన్నారు…జగన్ ఇచ్చారా. ఒక్క ఇల్లు ముంపు బాధితులకోసం కట్టారా? జగన్ పోలవరం ముంపు గ్రామాల ప్రజల కోసం ఇళ్లు కట్టి ఉంటే వారికి కష్టాలు తప్పేవి. ప్రభుత్వం సమస్యలపై సమాధానం చెప్పాలి…ఎదురుదాడి కరెక్ట్ కాదు.పోలవరం ముంపు బాధితులను ఏం చేస్తారో జగన్ చెప్పాలి.భూ సేకరణ లోను పెద్ద స్కాం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టిడ్కో ఇళ్లు కడితే….వాటినీ కేటాయించలేదు. ప్రభుత్వం చెప్పిన విధంగా వరద బాధితులకు పరిహారం ఇవ్వకపోతే మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తాం.

Leave a Reply