Suryaa.co.in

Telangana

హరీష్‌రావు…రాజీనామా పత్రంతో రెడీగా ఉండు

– మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు
– అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్‌…

-నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో కూర్చున్నాడు..
– కాళేశ్వరం డిజైన్‌ మందేసి గీశాడో..దిగాక గీశాడో కూలింది…
-నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా
-రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి సాక్షిగా మాట ఇస్తున్నా
– రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తేలుస్తాం..
-ఆనాడు పెట్రోల్‌ పోసుకున్న నీకు… అగ్గిపెట్టే దొరకలేదని చెప్పినట్లు కాదు…
– వరంగల్‌ జన జాతర సభలో కేసీఆర్‌, హరీష్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్‌, హరీష్‌రావుపై ఫైర్‌ అయ్యారు. ఆయన మాట్లాడుతూ మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయ కుడు కేసీఆర్‌ నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో కూర్చున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ మందేసి గీశాడో.. దిగాక గేశాడో కూలిపోయింది…కేసీఆర్‌కు నేను సవాల్‌ విసు రుతున్నా… నువు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే చర్చకు రా.. నీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రా అని సవాల్‌ విసిరారు. రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా… పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా… హరీష్‌రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు..నీ సంగతి తేలు స్తాం…ఆనాడు పెట్రోల్‌ పోసుకున్న నీకు అగ్గిపెట్టే దొరకలేదని చెప్పినట్లు కాదని వ్యాఖ్యా నించారు.

వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం
వరంగల్‌ ప్రజల అండతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతీ గ్రామానికి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను నెల కొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తాం..వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి చేస్తాం..వరంగల్‌లో ఎయిర్‌పోర్టు అభివృద్ధి చేసి మహర్దశ కల్పిస్తాం. వరంగల్‌ నగరాన్ని పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. కాకతీయ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమించి యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాం..ఉత్తర తెలంగాణ అంతా వరంగల్‌ వైపుచూసేలా నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.

భూ కబ్జాకోరు రమేష్‌ కావాలా? పేదల మనిషి కావ్య కావాలా?
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆత్మహత్యలు ఆపుతానని మోదీ హామీ ఇచ్చారు..కానీ ఆత్మహత్యలు ఆగలేదు.. రైతుల ఆదాయం పెరగలేదు.. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పా టు చేయకుండా ఈ ప్రాంతానికి మోదీ మోసం చేశారు..కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని తరలించుకుపోయారు.. బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుంది..భూములు ఆక్ర మించుకున్న ఆరూరి రమేష్‌ అంగీ మార్చి, రంగు మార్చి వస్తుండు…ఏ రూపంలో వచ్చినా.. ఏ వేషంలో వచ్చినా ప్రజలు బండకేసి కొడతారు… భూములు ఆక్రమించుకునే ఆరూరి రమేష్‌ కావాలో.. పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తేల్చుకోండి.. ఆరూరి రమేష్‌కు ఓటు వేస్తే.. అనకొండగా మారి మీ భూములను మింగేస్తాడని హెచ్చరించారు.

ఆ నలుగురిదే రాజ్యమిక్కడ…
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ పార్టీపై అనేక దౌర్జ న్యాలు జరిగాయి. దయాకర్‌రావు నుంచి మొదలు, ఆరూరి రమేష్‌, గండ్ర వెంటక రమణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి వరకు ప్రజల మీద పడి కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము తిని ప్రజలకేం చేయలేదు. వరంగల్‌లోని క్రషర్‌లు, గ్రానైట్‌ కంపెనీలు కేవలం వీళ్ల నలుగురి పేరు మీదనే ఉంటాయి. చేనేత కార్మికులకు ప్రత్యేక నిధి కేటాయించి ఆదుకోవాలని సీఎంకు విన్నవిస్తున్నాను. వరంగల్‌లో 60 వేల మంది మైనార్టీలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వారికి నివాస సౌకర్యాన్ని కల్పేంచేందుకు ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించాలని విన్నవిస్తున్నా ను. ప్రతి ఇంటి నుంచి ఒకరు ఉపాధి, ఉద్యోగావకాశాలను పొందేలా కార్యాచరణను అమ లు చేయాల్సిన అవసరం ఉంది. వీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో వరంగల్‌కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇండస్ట్రియల్‌ కారిడార్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. రాబోయే రోజుల్లో అన్ని అంశాలతో డీపీఆర్‌ తయారుచేయించి అభివృద్ధి కార్యక్రమాలను గొప్పగా చేపడతాం. కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE