కిషన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడతారు

Spread the love

-కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసే ప్రకటనలన్నీ బూటకమని, అందులో ఒక్కటీ నిజం ఉండదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ గురించి కిషన్‌రెడ్డి చెప్పినంత గొప్పగా అక్కడేమీ జరగడం లేదని స్పష్టం చేశారు.

ఇంకా హరీష్‌రావు ఏమన్నారంటే..బీబీ నగర్ ఎయిమ్స్ గొప్పగా ఉందన్నట్టు మాట్లాడుతాడు.నేను వెళ్లి చూసా అక్కడ ఏమైనా ఉందా. అక్కడ ఒక ఇన్ పేషెంట్ లేదు. సర్జరీ లేదు. డెలివరీ లేదు. పేదలకు ఎలాంటి వైద్య సేవలు అందటం లేదు.అక్కడ చేరిన వైద్య విద్యార్థులు బాధ పడుతున్నారు.ఎయిమ్స్ స్థాయిని దిగజార్చింది మీ బీజీపీ ప్రభుత్వం.

పక్కనే ఉన్న పి హెచ్ సీలో 11 డెలివరీలు జరిగాయి. ఎయిమ్స్ లో ఎందుకు జరగటం లేదు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతేడాది ఎయిమ్స్ వచ్చి చూసి వెళ్లారు. కానీ ఎయిమ్స్ కి తెచ్చింది ఏం లేదు. ఒక్క మాట మాట్లాడడు. తెలంగాణ ప్రయోజనాలు అంటే ఇక్కడి నేతలకి పట్టదు.గతంలో ఎయిమ్స్ కి తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని నాలుక కరుచుకున్నారు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మళ్లీ మాట్లాడుతున్నాడు.

మాపై లేని పోని నిందలు, విమర్శలు చేసే బీజీపీ నాయకులు తెలంగాణ ఎయిమ్స్ గురించి పట్టించుకోండి.ఉస్మానియా ఆసుపత్రి గురించి మాట్లాడాడు.. అక్కడ వైద్యం బాగోలేదని చెబుతున్నాడు. ఒక్కసారి వచ్చి చూడు కిషన్ రెడ్డి. మా వైద్య సిబ్బంది ఎంతో కష్టపడి సేవలు అందిస్తున్నారు. వారిని అవమానించేలా ఎలా మాట్లాడతావ్?

ఉస్మానియాలో వైద్య సేవలు బాగోలేక పోతే.. మోకీలు మార్పిడి సర్జరీలు, అవయవ మార్పిడి సర్జరీలు, ఇతర అరుదైన చికిత్సలు ఎలా జరుగుతున్నాయి.ఔట్ పేషంట్లు 6200 ఉంటే, ఇన్ పేషంట్లు 1900 దాకా ఎలా ఉంటారు. అంత మందికి వైద్యం అందించడం ఎలా సాధ్యం అవుతుంది.

Leave a Reply