‘సదర్’ ఉత్సవాలకు హర్యానా ‘బాహుబలి’

హైదరాబాద్ లో ఈ నెల 6న జరిగే సదర్ ఉత్సవాల్లో భాగంగా.. చప్పల్ బజార్ లోని చిట్టబోయిన లడ్డు యాదవ్ నిర్వహించే సదర్ ఉత్సవాల్లో , చిట్టబోయిన సందీప్ యాదవ్ ఈ సారి ప్రపంచంలోనే ఎత్తైన హర్యానా కు చెందిన బాహుబలి దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా తీసుకురానున్నారు. ప్రపంచంలోనే అతి పొడవు , ఎత్తైన ఈ దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవడం తెలంగాణ చరిత్ర లో నే ప్రథమం. హర్యానా కి చెందిన దల్బీర్ సింగ్ అనే పాడి రైతు, ఈ దున్నని పెంచారు. ఈ దున్నకు దేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమా పేరు పెట్టడం విశేషం. ఈ నెల 3 తారీఖున హైదరాబాద్ చప్పల్ బజార్ కు హర్యానా నుండి రానుంది. ఈ దున్నని చూడదానికి తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో నుంచి సదర్ కార్యక్రమంలో ప్రజలు,అభిమానులు భారీ స్థాయిలో రానున్నారు. హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలకు ప్రాముఖ్యం ఉంది.