సినిమా నిర్మాణంలో..
వ్యాపార రంగంలో..
తన కెరీర్లో తరగని సిరి జయభేరి..!
మాగంటి మురళీమోహన్..
మనకు తెలిసిన వారాలబ్బాయి..
అవకాశం లేని పిల్లలు
వారాలబ్బాయిలుగా మారకుండా విద్యాభిక్ష
పెట్టిన వదాన్యుడు..
సినిమా రంగంలో
వివాదాలే లేని మాన్యుడు!
పిల్లలనూ క్రమశిక్షణతో
పెంచుతూ
ఓ తండ్రి తీర్పు!!
ఈ మోహనుడికి
అప్పుడే ఎనభై మూడేళ్లు..
కనిపించని వృద్ధాప్యం..
దిక్కులు చూడకు రామయ్య
పక్కనె ఉన్నది సీతమ్మ..
అంటూ గంతులు
వేయని ఈ పిచ్చిపంతులు..
ఇప్పటికీ అందంగా
సిరిమల్లె పూవల్లె నవ్వు..
సేవాకార్యక్రమాలంటే లవ్వు!
భూమిని నమ్మిన వ్యాపారి..
నికార్సయిన వ్యవహారి..
సినిమానే జీవితం..
జీవితమే సిని’మా’..
జగమేమాయ ఆంటూ చేసినా అరంగేట్రం..
జరసుధను అనుమానిస్తూ
కొన్ని సినిమాలు ఒకే చట్రం..
ప్రేమలేఖలు..అమరదీపం..
ఆమెకథ..జ్యోతి..
ఈ సినిమాలతో
ఎగరేసాడు
విజయఛత్రం!
జ్యోతి…కల్పనతో
విరిసిన చైత్రం..!!
వ్యాపారంలో
అందె వేసిన చేయి..
రాజకీయాల్లోనూ వేశాడు
ఓ చేయి…
అక్కడ అర్థం కాని నిశీధి..
ఇది నచ్చని వీధి..
నప్పని విధి..హతవిధీ
అని తలచి
నప్పని రంగం వద్దని
నచ్చే రంగమే ముద్దని…
పాలిటిక్స్ కు గుడ్ బై
చెప్పేసిన సేవాతరంగం…
ఇప్పుడు స్వేచ్చావిహంగం!
తేలిక పడిందేమో
మాగంటి అంతరంగం!!
హ్యాపీ బర్త్ డే మురళీమోహన్ జీ..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286