ఒకనాడు పీల గొంతుతో
బక్క పలచని కుర్రాడు..
అక్కినేని *వారసుడు*
ఆ ఇంటి *చినబాబు..*
*విక్రమ్* గా వచ్చాడు..
*మన్మధుడు* గా ఎదిగాడు!
*అన్నమయ్య* గా గెలిచాడు..
*రామదాసు* గానూ
రాణించాడు..!
నాగార్జున..
క్లాసు అనుకుంటే *గీతాంజలి*
మాస్ అనుకుంటే
మమ *మాస్..*
లవర్ బాయ్ అనుకుంటే
*మజ్ను..*
అన్నీ ట్రై చేశాడు
ఈ *హలో బ్రదర్*
9848022338..
*శివమణి..!*
పెద్ద హిట్టు
కొట్టాలన్న ఆరాటం
నాన్న హీరోయిన్
శ్రీదేవితో *ఆఖరిపోరాటం*
బ్లాక్ బస్టర్..
ఆ వెంటనే మరో ప్రయత్నం
పరువు *గోవిందా గోవింద*
అదేమీ కర్మమో
అంతకుముందు అదే వర్మతో
*శివ* లెత్తిన *ఘరానాబుల్లోడు*
మళ్లీ రాము జోలికి
పోనని మారాము..
ఆ ఇద్దరి జతలో
మరి సినిమా లేదు సుతరాము..!
వినరో భాగ్యము..
_తెలుగు పదానికి జన్మదినం
*అన్నమయ్య*
కథనం..
నాగార్జున జీవితంలో
కళాఖండం..
మనమెరిగిన
నాగార్జునని మించి.. అన్నమయ్యలాగే కనిపించి..
నాన్నని తలపించి..
*రామదాసు* గానూ
మురిపించి..
*సాయిబాబా* గానూ
ఓ ప్రయత్నం..
ప్రయోగాలే నాగార్జున ఇజం..
అవే ఆయన మేనరిజం..!
అంతా బాగుంది కాని..
ఓ బాసూ.._
ఎందుకొచ్చిన ఆ బిగ్ బాస్..
నీ ఇమేజ్ కి ఎంత లాస్..
ఆపేస్తేనే నీకు ప్లస్
అక్కడ సీజన్ల మీద సీజన్లు..
జనాలకు అనవసర
కన్ఫ్యూజన్లు!
-సురేష్ కుమార్ e
9948546286