Suryaa.co.in

Entertainment

మా చెడ్డ మాయ’లోడు

నవ్వితే నవరత్నాలు..
నటకిరీటి నవ్విస్తే నవ్యరత్నాలు..

సినిమాల్లో నవ్వులు కమేడియన్ల డ్యూటీ..
ఆ డ్యూటీని లూటీ చేసి
హాస్యానికి హీరో హోదా తెచ్చిన రాజేంద్రుడు..
నవ్వులు పండించడంలో
గజేంద్రుడు..!

రేలంగి లాంటి కోణంగి..
పొట్టిప్లీడరు టైపు
చెట్టుకింద ప్లీడరు..
రాజబాబు వంటి నవ్వులరేడు..
ఆ తరంలోని
ఈ త్రయం
నవ్వులన్నీ మూటకట్టి
జంధ్యాల..నరసింహారావు..
ఈవివి…బాపు..
ఆ దిగ్గజాలతో జతకట్టి
బకెట్ల కొద్ది నవ్వుల టికెట్లు
చింపేసిన కామెడీ హీరో..
నవ్వుల బ్యూరో…!

అన్నట్టు..ఈ రాజేంద్రుడు
నవ్విస్తూ ఆగలేదండోయ్..
ఆ నలుగురు ఆంటూ
వైవిధ్యాన్నీ ఒప్పించాడు
ఈ నవ్వుల గురు..
మీ శ్రేయోభిలాషిగా
కొందరి మరణాన్ని ఆపే
పాత్రకు ప్రాణం పోశాడు..!

ఎన్ని సినిమాలు చేసినా
అలసిపోలేదు
ఈ నవ్వులరేడు..
నవ్విస్తూనే ఉన్నాడు నాడు..నేడు..
శవంతో కలిసి
కూర్చుని భోంచేస్తూ..
ఈ డబ్బున్నోళ్ళంతా
తెలివైనోళ్ళు అనుకుంటాం..
అదృష్టవంతులు రా..
అని స్టేట్మెంట్లిస్తూ..
మద్దిమద్దిలో ఊరు ఖాళీ
అయిపోతుందని బాధపడుతూ..
సాగిస్తున్నాడు
సినీమాల జైత్రయాత్ర..
ఈ నవ్వుల మాత్ర..!

ఎక్కడ ఉందో కాని మచ్చ…
ఈ జమజచ్చ..
నాలుగున్నర దశాబ్దాలుగా
అలా చెలరేగుతూ
చేసేస్తున్నాడు
నవ్వుల రచ్చరచ్చ..
ఆ విషయంలో యధేచ్చ!

సురేష్ కుమార్ e
9948546286

LEAVE A RESPONSE