– రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు
ఢిల్లీ: విలువైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్ గచ్చిబౌలి లో నెలకొన్న సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాజ్యసభలో మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ ఎంపీ రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ భూముల్లో చెరువులతో పాటు అరుదైన వృక్ష సంపదతో పాటు పెద్ద సంఖ్యలో జింకలు,నెమళ్లు,పక్షులు ఉన్నాయని,ఇది జీవవైవిధ్యానికి నెలవుగా ఉందని ఎంపీ వద్దిరాజు వివరించారు.
అత్యంత విలువైన ఈ భూముల్ని వేలం వేయవద్దంటూ విద్యార్థులు,అన్ని వర్గాల ప్రజలు అభ్యర్థిస్తున్నారని, వీటిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, మనందరిపై ఉందని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.