Suryaa.co.in

Political News

అతనే.. అంతా !

దేశప్రముఖుల..కేంద్రపాలక ముఖ్యుల అమ్ముల పొదిలో..పాశుపతాస్త్రం..!
శత్రు దేశాల మీద ప్రయోగించటానికి ఆయుధాగారంలో..ఒక ప్రత్యేక..శక్తివంతమైన క్షిపణి రహస్యంగా భద్రపరచిఉంచుతారు.
అలాగే..ఇతను..!
మానవ సంబంధాల..కుల మత ప్రాంతాల విఛ్చిన్నకర..విన్యాసాల..నీచ వ్యూహాల సమాహారం..!గుది గుచ్చిన కుట్ర సిద్దాంతం..!
ఒక మానవ మానసిక ఆయుధం..!
తమకు అవసరమైనప్పుడు వాడుకుంటారు.
శత్రుకూటమి ని ఛేదించటానికి అస్మదీయులకు ఇచ్చి వాడుకోమంటారు.
సర్వసత్తాక..సర్వ స్వతంత్ర ..సంపూర్ణ ప్రజాస్వామ్య భారత దేశానికి..!
గూఢచారి..నిఘావ్యవస్ద..రక్షణ వ్యవస్ద..రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడింది.
ప్రస్తుత పాలకులు తమ పార్టీ మనుగడ కోసం..ప్రజారంజక పాలన మీద కాకుండా..!
ప్రశాంత్ కిశోర్ టీమ్ ఏర్పాటు చేసుకున్నారు..!
ఎలాంటి వ్యూహకర్తయినా..ఎంతటి తోపయినా..కేంద్ర పెద్దల అండ లేక పోతే ఈక కూడా పీక లేడు.
రాజకీయ పార్టీలు..ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటారు అది వారి పార్టీ మనుగడ కి
మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావటానికి..!
ఇన్ని అరాచకాలకు కారకులెవరో తెలిసి కూడా
మరి దేశప్రజలు ఎందుకు మన్ను తిన్న పాముల్లా తయారయ్యారు?
ముఖ్యంగా తెలుగు ప్రజలు.
చపాతి తెలివి తేటలని ఎప్పటి కప్పుడు తిప్పికొట్టిన వీళ్ళు..!
దేశం అంతా ఎమర్జన్సీ అక్రమాలకు తల్లడిల్లి ఆమెను గద్దెదించితే..మేమున్నామన్నారు..!
దేశం అంతా సానుభూతి సునామీ లో చిక్కుకుంటే..మా అన్న మాగ్గావాలన్నారు..!
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ..శ్రీకాకుళం నుండి..ఆదిలాబాదు వరకు ఒకే తీరు..ఒకే తీర్పు ఇచ్చిన తెలుగు ప్రజలు.
వీళ్ళ వివేకము ఏమైంది..?
బుర్రలోని గుజ్జు ఎండి పోయిందా..?
బ్రిటీష్ వాడి తూటాకి గుండెను చూపించిన ఆంధ్రకేసరులు పుట్టిన గడ్డ..!
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం మీద సమరపతాకం ఎగరేసిన మన్యం వీరుడు నడయాడిన నేల..!
ప్రజా పోరాటాల పుట్టిల్లు..గజ్జెకట్టి నిజాం లాంటి నిరంకుశుడిని ఎదుర్కున్న జనగళం..!
ఏంపిలడో ఎల్దమొస్తవా అంటూ ..జింకలు పులులను తరిమిన నేల..విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించిన స్వరం..!
విద్యావంతులు..వివేకవంతులు..ప్రతిభాపాటవాలున్నాయనుకున్న వారు..సిగ్గుపడండి..!
ప్రశాంత్ కిశోర్ లాంటి డ్రగ్ కు బానిసయినందుకు..!
అతని ప్రభావానికి లోనయ్యి విచక్షణ కోల్పోయి కుల మత ప్రాంతాల కుళ్ళులో కొట్డుకు పోతున్నందుకు..!
కనీస ఆత్మాభిమానం..ఆత్మగౌరవం లేదా..?
ఎవడో వచ్చి..అదీ నీచ మనస్కుడు..మన ప్రజలని తన వ్యూహాలతో చెడుగుడు ఆడుతుంటే..దద్దమ్మల్లా..వెర్రి వెంగళప్పల్లా ..చూస్తూ ఉంటారా?
చరిత్ర ఎంతో ఘనం..!
భవిష్యత్తు శూన్యం..!
ప్రలోభాలకు..వ్యూహాలకు బలయిన..తెలుగు జాతి..!
దేవుడు కూడా అసహ్యించుకుంటాడు..ఏవగించుకుంటాడు.

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE