Suryaa.co.in

Andhra Pradesh

ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో పెద్దపీట

– మంత్రి సత్య కుమార్ హర్షం

అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆరోగ్య రంగానికి గతేడాది కంటే 12.9 శాతం అధికంగా నిధుల్ని కేటాయించడం పట్ల ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పిహెచ్సీల్లో బ్రాడ్ బ్రాండ్ కనెక్టివిటీ ద్వారా టెలి మెడిసన్, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ డయాగ్గినెస్ట్, ఏఐ ఆధారిత సేవలను అందించడానికి దోహదకారిగా ఈ బడ్జెట్‌ ఉందని పేర్కొన్నారు. 36 లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ పై కస్టమ్స్ డ్యూటీ మినహాయించడం, రోగ నిర్ధారణ పరికరాలతో సహా మెడికల్ సుంకాలపై హేతు బద్ధీకరించినట్టు తెలిపారు. 2025-26 బడ్జెట్ లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కు ప్రాధాన్యం ఉందని, 2025-26లో దేశవ్యాప్తంగా 10000 వైద్య విద్య సీట్లను పెంపొందించనున్నారని, దీనివల్ల 2030 నాటికి ప్రతి 1000 రోగులకు ఒక వైద్యుడు (1:1000) అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE