Suryaa.co.in

Telangana

గద్దర్ ను చంపింది కాంగ్రెస్ వాళ్ళే

– గద్దర్ చావుకు భట్టి కారణం
– గద్దర్ పై రేవంత్ గద్దలా వాలారు
– గద్దర్ చరిత్రను రేవంత్ చేరిపేసే ప్రయత్నం చేస్తున్నారు
– గద్దర్ ను కాంగ్రెస్ కార్యకర్తగా పరిమితం చేయడం దుర్మార్గం
– నంది అవార్డు తిరస్కరించిన గద్దర్ పేరు మీద సినిమా అవార్డులా ?
– విశ్వవ్యాప్తమైన గద్దర్ పేరు ను నాంపల్లి గల్లీకి పెడతావా రేవంత్ ?
– ఉద్యమం లో రేవంత్ ఎపుడైనా గద్దర్ తో వేదిక పంచుకున్నారా?
– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,గాయకుడు సందీప్

హైదరాబాద్: ప్రపంచ వాగ్గేయ కారుడు ,ప్రజా యుద్ద నౌక గద్దర్ కు కాలికి మేము గజ్జెలుగా పని చేశాము. గద్దర్ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. నిన్న రవీంద్ర భారతి లో జరిగిన గద్దర్ జయంతి సభ కాంగ్రెస్ ఉత్సవ సభ గా మారింది. హంతకులే సంతాప సభ పెట్టినట్టు ఉంది. గద్దరన్న కు కులం ,వర్గం ఏమీ లేదు.నిన్నటి సభకు కేవలం ఒకే వర్గాన్ని పిలిచారు.

తాము లేకపోతే గద్దరన్న లేనట్టుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు .చాలా దుర్మార్గం. ప్రపంచానికి గద్దర్ ని తామే పరిచయం చేసినట్టు గా మాట్లాడారు. గద్దర్ ఏనాడైనా అవార్డులకు పాకులాడారా ? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాజర్ అనే బుర్ర కథా కళా కారుడికి పద్మ శ్రీ అవార్డు ప్రకటిస్తే గద్దర్ వ్యతిరేకించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే పద్మ శ్రీ అవార్డు ఎలా తీసుకుంటావని నాజర్ కు అజ్ఞాతం నుంచి గద్దర్ గతం లో లేఖ రాశారు.

పద్మ శ్రీ అవార్డుల పై వ్యతిరేక భావన తో ఉన్న గద్దర్ పేరును రేవంత్ పద్మ శ్రీ అవార్డుకు ఎలా సిఫారసు చేస్తారు? గద్దర్ గురించి రేవంత్ కు తెలియదు కనుకే అవార్డు కు సిఫారసు చేశారు. గద్దర్ పై రేవంత్ గద్దలా వాలారు. గద్దర్ చరిత్రను రేవంత్ చేరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. గద్దర్ గతం లో నంది అవార్డు తిరస్కరించారు. నంది అవార్డు తిరస్కరించిన గద్దర్ పేరు మీద సినిమా అవార్డులా ? విశ్వవ్యాప్తమైన గద్దర్ పేరు ను నాంపల్లి గల్లీకి పెడతావా రేవంత్ ? చివరకు గద్దర్ ను రేవంత్ గల్లీకి పరిమితం చేశారు.

రేవంత్ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి కృషి చేసింది గద్దర్ అయితే, తెలంగాణ ఉద్యమం పై తుపాకీ ఎక్కుపెట్టింది రేవంత్ కాదా ? ఉద్యమం లో రేవంత్ ఎపుడైనా గద్దర్ తో వేదిక పంచుకున్నారా? అసలు గద్దర్ పై కాల్పులు జరిపించింది రేవంత్ గురువు చంద్రబాబు కాదా ? గద్దరన్న తో కలిసి నడిచింది మేము.

గద్దర్ ను కాంగ్రెస్ కార్యకర్తగా పరిమితం చేయడం దుర్మార్గం. గద్దర్ చివరి దాకా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడాడు. .ఆ పార్టీకి వ్యతిరేకంగా పాటలు రాశాడు. పసి మనసు గల గద్దర్ ను కాంగ్రెస్ వాళ్ళు మాయ చేసి రాహుల్ జోడో యాత్ర కు తీసుకెళ్లారు. భట్టి పాదయాత్ర కు గద్దర్ ను తీసుకెళ్లి నడిపించారు. భట్టి పాదయాత్ర లో గద్దర్ నడవడం వల్ల అనారోగ్యం పాలయ్యారు. గద్దర్ చంపింది కాంగ్రెస్ వాళ్ళే ..భట్టి యే గద్దర్ చావుకు కారణం.

గద్దర్ చనిపోతే అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది కేసీఆర్ కాదా? గద్దర్ కోరిక మేరకు హల్దీ వాగు దగ్గర అప్పటి మంత్రి హరీష్ రావు లిఫ్ట్ స్కీం మంజూరు చేశారు. ఆ స్కీం పూర్తి అయ్యాక గద్దర్ అక్కడికి వెళ్లి పూలు జల్లి కేసీఆర్ ను మెచ్చుకున్నారు. మేము గద్దర్ ను గౌరవిస్తే ..రేవంత్ ఆయనను మార్కెటింగ్ కు వాడుకుంటున్నారు. ఆర్ ఎస్ ఎస్ లో పుట్టిన రేవంత్ గద్దర్ పై కురిపిస్తున్న ప్రేమ వట్టిదే.

వాడుకుని వదిలేయడం రేవంత్ నైజం. గద్దర్ బిడ్డ వెన్నెల కు ఉప ఎన్నికలో రేవంత్ ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదు? సాంస్కృతిక సారధి ఛైర్మన్ పదవి వెన్నెలకు యిచ్చినా అంటున్న రేవంత్ రెడ్డి ఆ సంస్థను ఏర్పాటు చేసింది కేసీఆర్ అన్న విషయం మరచి పోకూడదు. గద్దర్ పేరును తీసుకునే అర్హత కాంగ్రెస్ కు లేదు. సీఎం రేవంత్ ,ఉప ముఖ్యమంత్రి భట్టి గద్దర్ ను ఓ ఉప కులానికి పరిమితం చేశారు.

మంద కృష్ణ కు పద్మ శ్రీ వస్తే రేవంత్ కు అభినందించే తీరిక లేదు. రేవంత్ గల్లీ కి కాదు గద్దర్ పేరు పెట్టాల్సింది. మెదక్ జిల్లాకు పెట్టు లేదంటే ఏదైనా యూనివర్సిటీ కి పెట్టు. సీఎం భాష ,తీరు చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోంది. గద్దర్ అవార్డులకు పార్టీలకు ఆతీతం .

LEAVE A RESPONSE