Suryaa.co.in

Telangana

అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు సీఎం కావడం ప్రజల దురదృష్టం

– మీరు పెట్టిన సర్వేలోనే కేసీఆర్ కు 70% నీకు 30% ఓట్లు
– పాలన చెయ్యమంటే ఫాల్తూ మాటలు ,పాగల్ మాటలు
– అది నోరా ? మోరా .. రేవంత్ రెడ్డి?
– మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లింది
– రేవంత్ రెడ్డి గా మారిపోయాడు
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ఇవాళ ఈ రాష్ట్రంలో ట్విట్టర్ కు టిక్‌టాక్ కు తేడా తెలియని వాడు..పాలన చెయ్యమంటే ఫాల్తూ మాటలు ,పాగల్ మాటలు మాట్లాడుతూ, అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ లో పోస్టు పెట్టి తెలంగాణ ప్రజల చేత తన్నించుకొన్నడు. మీరు పెట్టిన సర్వేలోనే కేసీఆర్ కు 70% నీకు 30% ఓట్లు పడేసరికి రేవంత్ రెడ్డి మైండ్‌బ్లాంక్ అయ్యింది.

నిన్న షాద్ నగర్ మీటింగ్ లో ఫ్రస్టేషన్ తో ఊగి పోతూ, ఎప్పటిలాగే ఆ కంపునోరుతో అవే అబద్దాలు. అవే సంస్కారం లేని మాటలు. అదే బూతులు మాట్లాడిండు. అందుకే నిన్న ప్రజలు ఎనుముల రేవంత్ రెడ్డి గా కాకుండా బూతుల రేవంత్ రెడ్డి అంటున్నరు. నేను మాట తప్పే, మడమ తిప్పే రకం కాదు అన్నవు రేవంత్ రెడ్డి, మరి రుణమాఫీ నేను రాగానే డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నదెవరు? ?

తర్వాత తెలంగాణ లో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15 లోపు చేస్తా అన్న దెవరు ? తర్వాత మళ్ళీ దసరా లోపు అన్నదెవరు? ? రేవంత్ రెడ్డి పూర్తి అయ్యిందా? రుణమాఫీ నేటికి 4 విడతలుగా వేసినా కూడా మీ లెక్కల ప్రకారం ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మా లెక్కల ప్రకారం ఇంకా 30 లక్షల మందికి కాలేదు. ఇది మాట తప్పుడు కాదా ? అని రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు. అందుకే నిన్ను ప్రజలు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి అంటున్నరు.

నీ నోటితోనే అన్నవు. కేసీఆర్ రెండు పర్యాయాలు కలిపి 29000 cr రుణమాఫీ చేసిండు అని. మీరే ఒప్పుకున్నారు మేము 21000cr చేసినం అని. మీకంటే కేసీఆర్ 8000 cr ఎక్కువ చేసినట్టే కదా ! మరి నిన్నేం మాట్లాడినావు ? అది నోరా ? మోరా ? రేవంత్ రెడ్డి. రైతుబంధు..ఇప్పుడు తీసుకుంటే 10,000 Dec 9 నాడు నేను రాగానే తీసుకుంటే 15000 అన్నదెవరు? ఇచ్చినావ 15000 చెప్పు రేవంత్ రెడ్డి? అదీ మేము డబ్బులు రెడీ చేసి 2 రోజుల్లో ఇస్తామని , మా హరీష్ రావు పాలకుర్తి సభలో చెప్పగానే ఎలక్షన్ మిషన్‌కు ఫిర్యాదు చేసి మేమివ్వబోయే రైతు బంధు ను ఆపి..నువ్వు రాగానే అవే డబ్బులతో పాత 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నదెవరు? ?

తర్వాత వానాకాలం పంటకు ఎగ్గొట్టి, తర్వాత యాసంగి పంటకు సంక్రాంతి కి ఇస్తానన్నదెవరు? ? ఇచ్చినావ రేవంత్ రెడ్డి ? తర్వాత మాట మార్చి జనవరి 26 న టిక్. . .టిక్ అన్నదెవరు? ? వినిపించిందా టిక్ టిక్ ? ఇప్పుడు మళ్లీ 31 అంటున్న దెవరు? ? ఇది మాట తప్పుడు కాదా ? అనడుగుతున్న రేవంత్ రెడ్డిని. కేసీఆర్ టంచనుగా 11 పంటలకు నాట్లప్పుడే 73000 cr రైతులకు వేస్తే . . .ఓట్లప్పుడే రైతుబంధు అంటున్నదేవడు ? రేవంత్ రెడ్డి కాదా ?

ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల్లో నే అవ్వ తాతలకు 4000 ఇస్తా అన్నదెవరు? ? కోడలుకు 2500 ఇస్తా అన్నదెవరు? ? తులం బంగారం ఇస్తా అన్నదెవరు? ? 5 లక్షల విధ్యా భరోసా కార్డు ఇస్తా అన్నదెవరు? ? ఆడపిల్లలకు Scooty ఇస్తా అన్నదెవరు? ? 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నదెవరు? ? ఏడాది లోనే 2 లక్షల ఉద్యోగలిస్తానన్నదెవరు? ? 100 రోజుల్లో ఇస్తా అని 400 రోజులు అయిపోయింది వచ్చినాయా ఇవి ? రాలే ! మరి ఇది మాట తప్పుడు కాదా ? అని అడుగుతున్న రేవంత్ రెడ్డి ని.

రేషన్ కార్డులు, రైతు కూలీలకు 12000 భరోసా, ఇందిరమ్మ ఇండ్లు జనవరి 26 న రాష్ట్రమంతా ఇస్తా అన్నదెవరు? ? పోలీసు పహారాలలో గ్రామసభలు పెట్టి ప్రజల చేత తన్నించుకొని ఇప్పుడు మండలంలో ఒకే ఊరికిస్తా అన్నదెవరు? ? ఇది మాట తప్పుడు కాదా ? అని అడుగుతున్న రేవంత్ రెడ్డి ని. ప్రజా పాలన అని ప్రతిరోజు ప్రజలను స్వయంగా కలుస్తా అన్నదెవరు? ? కలుస్తున్నవా ? ఈ 14 నెలలల్లో ఒకే ఒక్క రోజు 1 గంట కలిస్తివి. ఇది మాట తప్పడం కాదా ? అని అడుగుతున్న రేవంత్ రెడ్డి ని .

అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండేటట్టు సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం కేసీఆర్ కడితే దాన్ని కాదని, నీ జూబ్లీ ప్యాలెస్ నుండి లేకపోతే police ల అధీనంలో ఉండే కమాండ్ కంట్రోల్‌రూమ్ నుండి పాలన సాగిస్తూ , మంత్రులను,అధికారులను నీ చుట్టూ తిప్పుకుంటున్న అహంకారివి నువ్వు కాదా ? అని అడుగుతున్న రేవంత్ రెడ్డి ని.

రైతు బాంధవుడైన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఏమాత్రం లేదు.కెసిఆర్ కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు. 14 నెలల కాలంలోనే మీ మూడు రంగుల జెండా అసలు రంగు బయటపడ్డది. అందుకే ప్రజలు నీ మాటలను నమ్ముతలేరు. నువ్వు టివి ల కనిపిస్తేనే చానెల్స్ చేంజ్ చేస్తున్నారు. మైకులు పెట్టగానే నిన్ను బూతులు తిడ్తున్నారు. కెసిఆర్ కొడితే దెబ్బ ఎట్లుంటదో నీకు తెలవదా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్ గడ్డమీదకి వచ్చి నిన్ను మట్టిగరిపించినం.అక్కడ కొట్టిన దెబ్బకు వచ్చి మల్కాజిగిరిలో పడ్డవు.

యావత్ తెలంగాణ ప్రజలు నిన్ను ఓటు తోని మళ్ళీ కొడుతరు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని గంగలో పడేస్తరు. ఇప్పటికైనా కేసీఆర్ మీద నోరు పారేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించు. చిల్లర మాటలు బంద్ పెట్టి, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంపై దృష్టి సారించు. మీ సెల్ఫ్ డబ్బా కు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లింది. ఇకనైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి.

నీ మాటలు ప్రజలు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు ఇలా ఎవరూ నమ్మడం లేదని ఆందోళన నీలో పెరిగిపోయింది. అందుకే నాకు తెలిసిన ఒక మానసిక వైద్యుడు రేవంత్ రెడ్డి కి అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ అనే వ్యాధి మొదలైంది అని అన్నాడు.అందుకే బూతుల రేవంత్ రెడ్డి గా మారిపోయాడు. మంచి మానసిక వైద్యుడిని సంప్రదించమని రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల సూచించారు.

LEAVE A RESPONSE