– నిరుపేదలకు ఈ బడ్జెట్ లో ఏమిచ్చింది ?
– మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: నిన్న రాష్ట్రపతి ప్రసంగం ,నేడు కేంద్ర బడ్జెట్ చూశాము. కొద్ది మందికి లాభదాయకంగా ,రాజకీయ పరంగా ఉపయోగపడేందుకు ఈ బడ్జెట్ రూపొందించారు. గురజాడ అప్పారావు సూక్తి దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ ని సీతారామన్ ఉటంకించారు .కానీ బడ్జెట్ ఆ దిశగా లేదు. మానవతా దృక్పథం ఈ బడ్జెట్ లో లోపించింది.
సంపన్న వర్గాలకు చెందిన బ్యాంకు రుణాలను మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం నిరుపేదలకు ఈ బడ్జెట్ లో ఏమిచ్చింది ? మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని బడ్జెట్ మరోసారి రుజువు చేసింది. కేసీఆర్ హయం లో రూపొందిన పథకాల స్ఫూర్తి ఈ బడ్జెట్ లో కనిపించింది. కేసీఆర్ మిషన్ భగీరథ తో వంద శాతం గ్రామాలకు తాగు నీరు ఇచ్చారు.
కేంద్ర బడ్జెట్ లో జల్ జీవన్ మిషన్ కింద వచ్చే ఎనిమిదేళ్లలో వంద శాతా గ్రామాల్లో తాగు నీరు ఇస్తామంటున్నారు. కేసీఆర్ ముందు చూపుతో జిల్లాకో మెడికల్ కాలేజీ స్థాపించి సీట్ల సంఖ్యను 8500 దాకా పెంచారు. కేంద్ర బడ్జెట్ లో మెడికల్ సీట్ల ను పెంచుతామని ప్రకటించారు. పోలవరం గురించి రాష్ట్రపతి ప్రసంగం లో ,బడ్జెట్ లో ప్రస్తావించారు.
ఏపీ పునర్విభజన చట్టం లో తెలంగాణ కు ఇస్తామన్న వాటి గురించి బడ్జెట్ లో ప్రస్తావన లేదు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంగతి లేదు. మూడు కోట్ల ఇండ్లు కడతామంటున్నారు ..గతం లో చెప్పిన లక్ష్యాలను చేరుకోలేదు .ఇపుడు కొత్తగా ఇన్ని కోట్ల ఇండ్లు అంటే నమ్మేదెలా ? ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని బడ్జెట్ దెబ్బతీసింది. gst ఒక్క శాతం తగ్గిస్తామంటే చాలా మందికి మేలు జరిగేది. బడ్జెట్ లో రాజకీయ కోణమే ఎక్కువ కనిపించింది.
సంపన్న వర్గాల కోసమే బీజేపీ ఆలోచిస్తుందని ఈ బడ్జెట్ రుజువు చేసింది.తెలంగాణ గత పదేళ్ల లో అద్భుత ప్రగతి సాధించింది. ప్రగతి శీల రాష్ట్రానికి బడ్జెట్ లో ఏమీ దక్కలేదు. బడ్జెట్ లో తెలంగాణ కు జరిగిన అన్యాయాన్ని బీ ఆర్ ఎస్ పక్షాన ప్రజలకు వివరిస్తాం.