ఇంటింటా ఆరోగ్యం

– ఇంటింటికీ ఆరోగ్య కార్యకర్తలు
– కరోనాపై సర్కార్ సమర శంఖం
– ఆరోగ్య తెలంగాణ సీఎం కేసీఆర్ ధ్యేయం
– ప్రజలంతా కావాలి భాగస్వామ్యం
– జ్వర సర్వేలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో నిండాలి. రాష్ట్రం మొత్తం ఆరోగ్య తెలంగాణ కావాలి. ఇదే సీఎం కెసిఆర్ లక్ష్యం, ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. జ్వర సర్వేలో భాగంగా ఈ రోజు మంత్రి జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం, పాలకుర్తి మండలం ఎల్లారాయని తొర్రూరు గ్రామాల్లో జ్వర సర్వేలో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి జ్వర సర్వే కార్యకర్తలతో మాట్లాడారు. సర్వే జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉందని అడిగారు. జ్వర సర్వే ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కరోనా విజృంభణ కాస్త ఎక్కువ వున్నా, తీవ్రత తక్కువగా ఉంది. ప్రజలు భయపడాల్సిన పని లేదు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వారి ఆరోగ్య పరిరక్షణ
daya లక్ష్యంగా సీఎం కెసిఆర్ జ్వర సర్వే కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఆవాసం, ప్రతి ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వస్తారు. మీ ఇంట్లో అందరినీ పలకరిస్తారు. మీ ఆరోగ్యం పై అరా తీస్తారు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? టీకాలు వేసుకున్నారా? ఇంకా వేసుకోవాల్సిన వారు ఉన్నారా? ఉంటే వెంటనే మీ వివరాలు రాసుకొని, అక్కడే మందుల కిట్ ఇస్తారు. అవసరమైతే, సమీపంలోని హాస్పిటల్ కి పంపిస్తారు.

టీకాలు మీ మీ ప్రతి గ్రామంలో వేస్తారు. ప్రత్యేకంగా సెంటర్స్ నడుస్తున్నాయి. టీకాలు వేసుకోవాలి. అనారోగ్యం అనిపిస్తే వెంటనే మందులు వాడాలి. సీఎం కెసిఆర్ ఆరోగ్య తెలంగాణ ను కోరుకుంటున్నారు. మనమంతా భాగస్వాములం అవుదామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. కరోనా ను ఎదుర్కోవడంలో తెలంగాణ ముందుంది. సీఎం కెసిఆర్ ఎంతో ముందు చూపుతో చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అవడంతో స్వచ్ఛ తెలంగాణ సాధ్యమైంది. దీంతో మన రాష్ట్రంలో కరోనా కట్టడిలోనే ఉంది అన్నారు.

అయితే, కరోనా విజృంభణను అరికట్టే శక్తి మన చేతుల్లోనే ఉందని చెప్పారు. సామాజిక భౌతిక దూరం పాటించాలని, మాస్కులని తప్పనిసరిగా వాడాలి సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను, సామాజిక పారిశుద్ధ్యం పాటించాలని మంత్రి ప్రజలకు వివరించారు.
ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికి వచ్చి కరోనాకి చికిత్స అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పటికే ప్రతి హాస్పిటల్ లో తగు ఏర్పాట్లు చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ పడకలతో సహా అవసరమైన మందులు, ఇతర ఏర్పాట్లు చేశామని, ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా, అంగన్ వాడి కార్యకర్తలు ప్రజల ఆరోగ్యం కోసం ఫ్రంట్ వారియర్స్ గా చేస్తున్న సేవలను మంత్రి ప్రశంసించారు. ఈ జ్వర సర్వే పూర్తి అయితే, ప్రజలకు ప్రభుత్వ వైద్యం మరింత సమర్థంగా, వేగంగా అందించడం సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు ఆరోగ్య సిబ్బంది, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply