– బోనాల ఉత్సవాల సందర్భంగా ఎగ్జిబిషన్
– బీసీ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం
– హజరుకానున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులు
– పర్యావరణ హితమైన చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు మార్కెటింగ్
– బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలి
– పెద్ద ఎత్తున చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి
– బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వము బోనాల ఉత్సవాల సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25-06-2025 నుండి 29.06.2025 వరకు ఐదు రోజులు బి.సి. చేతివృత్తుల కళాకారులచే తయారుచేసిన వివిధ వస్తువుల ప్రదర్శన మరియు అమ్మకం నిర్వహిస్తున్నాం.
టాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహము ప్రక్కన గల ప్రదేశములో ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనలో కుమ్మరులు వారు తయారుచేసిన మట్టిపాత్రలు, గౌడన్నలచే ‘నీరా’ స్టైల్, మేదరివారు తయారు చేసిన వెదురు వస్తువులు, పూసలవారి సామగ్రి అలాగే పోచంపల్లి, గద్వాల, నారాయణ పేట మొదలైన చేనేత ఉత్పత్తులు, ఇతర బిసి వర్గాలచే తయారుచేసిన వస్తువులు అందుబాటులో ఉంటాయి.
ఇది కాకుండా తెలంగాణ వంటకాలు, బెస్త సోదరులచే చేప వంటకాలు మరియు ఇతర భోజన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10:00 గంటల నుండి సాయత్రం 09:30 గంటల వరకు ఉంటుంది. ప్రవేశము ఉచితము.
బీసీ చేతివృత్తుల వారి పర్యావరణ హితమైన ఉత్పత్తుల ప్రదర్శనకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలి. ఈ ప్రదర్శనను తిలకించి వారికి నచ్చిన వస్తువులు, పర్యావరణ హితమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉత్పత్తులు కొనుగోలు చేసి చేతివృత్తుల వారికి చేయూత ఇవ్వాలని, ఈ ప్రదర్శన విజయవంతము చేయాలని మంత్రి ప్రభాకర్ కోరారు.