Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుంది

– సజ్జల రామకృష్ణా రెడ్డి

తాడేపల్లి: వైఎస్సార్సీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న మీ అందరి పాత్ర చాలా కీలకమైంది. గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికలకు మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించామని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి అధ్యక్షతన ‘పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం’ సమావేశం జరిగింది. సమావేశంలో సజ్జల మాట్లాడారు.

పంచాయతీరాజ్‌ విభాగాన్ని బలోపేతం చేయాలని జగన్‌ ఆదేశించారు. మీ విభాగం బలోపేతం అయినప్పుడే బలంగా ఉండగలుగుతాం. ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా మీ నాయకత్వం పటిష్ఠం కావాలి. పంచాయతీరాజ్‌ చట్టాన్ని బలోపేతం చేసేందుకు మీరంతా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్‌ రూట్‌ లెవల్‌లో బలంగా ఉండాలి.

కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది, ప్రజల్లో, పార్టీ క్యాడర్‌ లో ఇదే చర్చ జరుగుతోంది. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదు, లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా నాశనం అయింది. సామాన్యులు కూడా బలవుతున్నారు, గవర్నెన్స్‌ పూర్తిగా భ్రష్టుపట్టింది.

మళ్ళీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్ధాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారు. వేలకోట్లు దోచుకోవడం లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోంది, కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలి, అందుకు ప్రజలను అప్రమత్తం చేద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ విభాగం అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీద్దాం, ఉపాధి హామీ నిధుల దోపిడీని అడ్డుకుందాం. కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, వాటిని దీటుగా ఎదుర్కొందాం. స్థానిక సంస్థల్లో మన ఉనికిని చాటి చెబుదాం. అనేక అంశాలపై మన విభాగంలో క్రియాశీలకంగా ఉన్నవారంతా ఎప్పటికప్పుడు స్పందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE