Suryaa.co.in

Entertainment Telangana

హేమ రేవ్ పార్టీలోనే ఉంది

– తేల్చేసిన బెంగళూరు కమిషనర్ స్పష్టీకరణ
-రాడిసన్ అనుభవంతో బెంగళూరుకు మారిన రేవ్ పార్టీ
– లేనంటూ అడ్డంగా వాదించిన హేమ

బెంగళూరు: ఇప్పటిదాకా తనకేమీ తెలియదని ఆస్కార్ లెవల్లో నటించిన తెలుగు సినీ నటి హేమ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. హేమ ‘‘ సన్ సెట్ టు సన్‌రైజ్’’ పేరిట, బెంగళూరు ఫాంహౌజ్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలోనే ఉందని బెంగళూరు పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. దానితో హేమ ఆడినవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది.

రేవ్ పార్టీలో హేమ ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆమె తొలుత ఖండించారు. ‘‘నేనుఎక్కడికీ పోలేదు. నా ఫాంహౌస్‌లోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నా. నాపై అనవరంగా దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని అమాయకంగా వీడియో విడుదల చేసింది. దానిని చూసిన వారంతా నిజమేనని భావించారు. కాగా హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడిదో విచారిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు.

కాగా ఇటీవల హైదరాబాద్ గచ్బిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతోపాటు, అందులో పలువురు సినీ నటీనటులు దొరికిన విషయం తెలిసిందే. దాని లింకులు చివరకు గోవాలో దోరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద హోటళ్లు, ఫాంహౌస్ యజమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దానితో హైదరాబాద్‌లో రేవ్‌పార్టీ సాధ్యం కాదని తెలుసుకున్న నిర్వహకులు, మకాంను బెంగళూరుకు మార్చినట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు హేమ పట్టుబడిన రేవ్ పార్టీ గురించి, సమీపంలోని ప్రజలే పోలీసులకు ఫిర్యాదు చేశారట. డీజే సౌండ్లు విపరీతంగా పెంచడంతో, అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపధ్యంలోనే బెంగళూరు పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేశారు.

ఇదిలాఉండగా బెంగళూరులో రేవ్‌పార్టీని వాసు 50 లక్షల రూపాయ ఖర్చుతో నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 45 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు, కొకైన్, 18 లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో చాలామంది మత్తుపదార్ధాలను మరుగుదొడ్లలో కూడా పడేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి రక్తపరీక్షలు నిర్వహించడంతో, ఎవరెవరు మత్తుపదార్ధాలు తీసుకున్నారో త్వరలోనే వెల్లడికానుంది.

LEAVE A RESPONSE