Suryaa.co.in

Andhra Pradesh

జవహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, సీతారామాంజనేయులు కనుసన్నల్లో దాడులు

– కేంద్ర ఏజెన్సీలతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై విచారించాలి
– మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి నడిరోడ్డుపై చంపారు
• రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయి
• వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు
• సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టాలి… కటకటాల్లోకి పంపాలి
• టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్

మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి నడిరోడ్డుపై చంపారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయి. వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా పోలీసలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు. తప్పనిసరి కేసులు నమోదు చేయాల్సి వస్తే నామమాత్రపు కేసులుపెట్టారు.

సీఎస్ జవహర్ రెడ్డి, అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కనుసన్నల్లో దాడులు జరిగాయి. సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టాలని.. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడారు.

నామమాత్రంగా కాకుండా లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టి కటినచర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఈ అరాచకాన్ని గుర్తించి అధికారులు బదీలీ చేసింది… లేదంటే ఎన్నికలు సజావుగా జరిగేవి కావు. కొంత మంది పోలీసు అధికారులు వైసీపీతో లాలూచి పడ్డారు. దాని ఫలితే రాష్ట్రంలో హింసకు కారణం … దాన్ని మానిటరింగ్ చేసింది సీఎస్, మాజీ డీజీపీలు. పలువురు పోలీసుల అధికారులను ఎన్నికల కమిషన్ ట్రాన్ఫర్ చేసినా అధికారుల్లో మార్పురాలేదు.

ప్రధాని, కేంద్ర హోంమంత్రి రాష్ట్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని వైసీపీ అవినీతిని ఎండగట్టారు. ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో ఎన్నికల్లో గెలవమని డిసైడ్ అయిన వైసీపీ నేతలు హింసాత్మక ఘటనలకు పూనుకున్నారు. కుట్ర ప్రకారమే ఎన్నికలు సజావుగా జరగకుండా చేయాలని ప్లాన్ చేశారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి వన్ సైడ్ చేసుకున్నారో అదే విధంగా జనరల్ ఎలక్షన్ ను జరపాలని ప్లాన్ చేశారు.

దీన్ని ఆచరణలో పెట్టడానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డిలాంటి అధికారులను వైసీపీ నేతలు వాడుకున్నారు. ఎన్నికల కమిషన్ దీన్ని కనిపెట్టి అధికారులను బదిలీ చేసింది.. అధికారులను బదిలీ చేయకుంటే ఎన్నికలు సజావుగా జరిగేవి కావు.

ఎన్నికలు సజావుగా జరుగుతుంటే తట్టుకోలేని వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ లో దాడులకు తెగబడ్డారు. మాచర్లలో మారణాయుదాలతో విధ్వంసం సృష్టించారు.. దాన్నినివారించడానికి పోలీసులు చర్యలు తీసుకోలేదు. మారణాయుదాలతో పెరెడ్ చేసిన వీడియోలు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. అందుకే ఎన్నికలు జరిగిన తరువాత వైసీపీ నేతలు రక్తపాతం సృష్టించారు.

తిరుపతిలో టీడీపీ నేత పులవర్తి నానిపై దాడి చేసి చంపాలని ప్రయత్నించారు. రాష్ట్రంలో జరిగిన హింసాత్మ ఘటనలపై సిట్ పూర్తిగా విచారణ చేపట్టి.. ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలి. దాడులు జరిగినప్పుడు రక్షించుకోవడానికి ప్రయత్నించిన వారిని కూడా ముద్దాయిలుగా చిత్రీకరించడం దారుణం.

దాడులు జరగడానికి కారకులు, ప్రేరేపిత వ్యక్తులు ఎవరో స్పష్టంగా సిట్ దర్యాప్తు చేయాలి. సిట్ అధికారుల పై అధికారులు ఇందులో ఉంటే థర్డ్ పార్టీ ఇన్వెష్టిగేషన్ తో దర్యాప్తు చేయాలి. దాడులకు ఉన్నతాధికారుల సహకారం ఉంది.. ట్రాన్ఫర్ చేసిన అధికారులు కాల్ రికార్డులను తనిఖీ చేయాలి. దాడుల కుట్రలో బాగస్వామ్యమైన అందరిని అరెస్ట్ చేయాలి. చీఫ్ సెక్రటరీ, మారిపోయిన డీజీపీ, ఇంటిలిజెన్స్ అధికారుల కాల్ డేటాను కూడా బయటకు తీసి రాజకీయ నాయకుల వ్యూహ రచన ఏంటో బయటకు తీయాలి.

కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ఏజెన్సీలతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై విచారించాలి. ప్రాధమిక బాధ్యులను వెంటనే కౌంటింగ్ విధుల నుండి తొలగించాలి. హింసాత్మక ఘటలను సహకరించిన అధికారులను కౌంటింగ్ కేంద్రాలకు కు దూరంగా ఉంచాలి. కౌంటింగ్ కేంద్రాలకు కేంద్రభద్రతా బలగాలతో భద్రత కల్పించాలి.

హింసాయుతం, రౌడీయిజం విలయతాండవం చేస్తుంటే పోలీసులుపట్టీ పట్టనట్లు వ్యవహరించారు. కావున కేంద్ర ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ కేసుల పెట్టాలి. పోలీసుల కష్టడిలో ఉన్న పిన్నెల్లి సోదరులు పారిపోతే చర్యలు తీసుకోలేదు? దీనికి సహకరించింది ఎవరు? దీని వెనుక ఉన్న అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE