-జనసేనకు గుడ్ న్యూస్
గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట దక్కింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.