Home » ప్రజలను హింసించడమే జగన్ పని

ప్రజలను హింసించడమే జగన్ పని

-అరలీటర్ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు
-నేను వస్తే పెట్టుబడులు, ఉద్యోగాలు.. జగన్ వస్తే గంజాయి, డ్రగ్స్ ఏం కావాలో మీరే తేల్చుకోండి
-సెంటు పట్టా ఇళ్ళను రద్దు చేయను, అసంపూర్తి ఇళ్లను పూర్తి చేస్తాం, పేదలకు రెండు సెంట్లలలో ఇంటి నిర్మాణం
-ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల పెత్తనం ఏంటి
-హుద్ హుద్ సమయంలో బస్సులో ఉండి ప్రజలకు అండగా నిలిచా
-ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాది
– పలాస ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో దొంగలు పడ్డారు. మనమందరం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. నేను పలాసకు అనేక సార్లు వచ్చాను. ఇంత పెద్ద సంఖ్యలో జనం కదలి రావడం మొదటి సారి చూస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడుతోంది. నాకు ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులు ఒకపక్క ఉండగా నాకేం భయం. ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై కసిగా ఉన్నారు. వైసీపీ పై ప్రజలు కక్ష తీర్చుకోవాలి.. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి. అందుకు నా తమ్ముళ్లు సిద్దంగా ఉన్నారు.

ఎక్కడికి వెళ్లినా జన సైనికుల ఉత్సాహమే కనబడుతోంది. మా నాయకుడిని అవమానించిన వారిని చితగ్గొట్టాలని మా సైనికులు సిద్దంగా ఉన్నారు. మనం ఎన్డీయేలో భాగస్వామ్యమయ్యాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మీ ముందుకొచ్చాయి. ఇక్కడ కు వచ్చేటప్పుడు నాకు ముందుగా గుర్తొచ్చేది ఎర్రన్నాయుడు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రి పదవి వస్తే కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను ఎంపిక చేసిన అభ్యర్థి ఎర్రన్నాయుడు.

నేడు ఎర్రన్నాయుడు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరనిది. రామ్మోహన్ నాయుడు తండ్రికి తగ్గ బిడ్డ. రెండు సార్లు ఎంపి అయ్యాడు. మూడో సారి ఎంపీ చేయడానికి మీరు సిద్దంగా ఉండాలి. ఇతనిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. పులికి పులిబిడ్డే పుడుతుంది. సర్దార్ గౌతు లచ్చన్న కూడా నాకు గుర్తొస్తారు. గౌతు లచ్చన్న ఒక స్వాతంత్ర్య సమర యోధుడే కాకుండా ఆరోజుల్లో ప్రజలు, రైతుల కోసం శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చ్ పెట్టిన మహా నాయకుడు గౌతు లచ్చన్న. 1978లో గౌతు లచ్చన్న గారితో పాటు అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్నాను.

ఎప్పుడూ విశ్రమించకుండా, పేదల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి గౌతు లచ్చన్న.. ఆయన కుమారుడిగా గౌతు శివాజీ రాజీలేని పోరాటం చేసి ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవలందించారు. అలాంటి కుటుంబంలో పుట్టిన గౌతు శిరీష వైసీపీ ప్రభుత్వంలో అవమానాలు భరించింది. ఒక్కసారి ఎమ్మెల్యే అయినవారికే ఇన్ని తోకలు వస్తే.. మూడు తరాలుగా రాజకీయాలు చేస్తున్నవారికి ఎంత పవర్ ఉండాలి? ఆ పవర్ ఉపయోగిస్తే వైసీపీ నేతలు ఎంత. అది వీళ్ల తప్పు కాదు.. పెద్ద సైకో జగన్ రెడ్డి చిన్న సైకోలను తయారుచేశాడు.

హుద్ హుద్ సమయంలో బస్సులో ఉండి పరిస్థితి చక్క దిద్దా
హుద్‍హుద్ తుఫాను సమయంలో ఇక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ చేసి ఈ ప్రాంతాన్ని కాపాడాను. దాదాపు రెండు వారాల పాటు ఇక్కడే ఉండి బస్సు నుంచే పాలన సాగించి తిరిగి హైదరాబాద్ పయనమయ్యా. ఇక్కడ తిత్లీ తుఫాన్ వచ్చిన సమయంలో దసరా పండుగను సైతం బాధితులతో చేసుకొని ఇక్కడే ఉండి ప్రాణనష్టం కలగకుండా, ఎక్కువ ఆస్తి నష్టం కలగకుండా కాపాడాం. విజయనగరంలో పాదయాత్ర చేస్తున్న సైకో జగన్ రెడ్డికి తిత్లీ తుఫాన్ బాధితులను కనీసం పరామర్శించలేదు. సీఎం పదవి ఇస్తేనే ఈ ప్రాంతానికి వస్తానని చెప్పిన దుర్మార్గుడు జగన్. మీకు కష్టమొస్తే గౌతు శిరీష, రామ్మోహన్ నాయుడు వెంటనే మీ ముందుకువస్తారు.

తిత్లీ తుఫాన్ పలాసలోనే ఉండి రూ.480 కోట్ల ఫ్యాకేజీతో ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్న తర్వాతే ఇక్కడి నుంచి వెళ్లా. నరేగా కింద జీడి మొక్కలు పంపిణీ చేసి.. పంటలను అభివృద్ధి చేయాలని సంకల్పించాం. ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారి తాగునీటి ప్రాజెక్టులు ఎర్రన్నాయుడు తెచ్చారు. కిడ్ని బాధితులకు మొట్టమొదటిగా పింఛన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సమస్యలను పవన్ కల్యాన్ నా దృష్టికి తెచ్చినప్పుడు వెంటనే స్పందించి డయాలసిస్ సెంటర్లు స్తాపించి బాధితులకు అండగా నిలిచాం. కిడ్నీ సమస్య నివారాణకు చేయాలన్న సంకల్పాన్ని, రిసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయకుండా వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసింది.

జగన్ యువతను దగా చేశాడు
ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువతే. రాష్ట్రంలో ఎక్కువమంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా యువతే. దేశం కోసం వీరోచితంగా పోరాడే శక్తి, పట్టుదల శ్రీకాకుళం జిల్లా యువతకు ఉంది. రాష్ట్రంలోని యువతను సీఎం జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్, డీఎస్సీ పేరుతో మోసగించారు. నా హాయంలో ఎనిమిది డీఎస్సీలు, ఎన్టీఆర్ హాయాంలో మూడు డీఎస్సీలు కలిపి టీడీపీ హాయంలో మొత్తం 11 డీఎస్సీలు నిర్వహించాం. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 70 శాతం టీడీపీ హాయంలో ఉద్యోగాలు పొందినవారే. 11 డీఎస్సీలు నిర్వహించిన ఘనత టీడీపీది.. ఒక్క డీఎస్సీ పెట్టలేని అసమర్థుడు జగన్ రెడ్డి అని పేటీఎం బ్యాచ్ కూడా గుర్తించాలి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీ పైనే పెట్టి యువతకు ఉద్యోగాలిస్తాం.

ప్రతి సంవత్సం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వంలో పెండింగ్‍లో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రాష్ట్రంలో పోలీస్ శాఖలో పెండింగ్‍లో ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పోలీసులకు పీఆర్ సీ ఎగ్గొట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. వారికి నెలవారీగా సక్రమంగా జీతాలు ఇవ్వకుండా, డీఏలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఉద్యోగస్తులు ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసే విధంగా పీఆర్సీ,డీఏలు ఇవ్వడమే కాకుండా పూర్తిగా గౌరవమిచ్చే బాధ్యత తీసుకుంటాం. దేశంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీ మారింది. బిహార్ కంటే ఏపీలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్నసత్యం. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డ్రగ్స్, గంజాయి, జే-బ్రాండ్‍తో యువత తప్పుదారి పడుతున్నారు. యువగళం కార్యక్రమంతో కేంద్రం సహకారంతో ఐదు సంత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాదీ బాధ్యత
విశాఖ నుంచి భావనపాడు వరకు పరిశ్రమలు తీసుకువచ్చి టూరిజం ప్రోత్సహిస్తే యువత బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. మంచి నీటితో కిడ్నీ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి నీళ్లు వంశధారకు తీసుకురావలని, వంశధార నీళ్లు బారువా వరకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. ఆప్సోర్‍ కోసం ఎప్పటినుంచో మాజీ ఎమ్మెల్యే శివాజీ పోరాడుతున్నారు. తప్పకుండా ఆప్సోర్ సాధిస్తాం. పలాసలో కూర్చుని పనిచేసే విధంగా రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోం తీసుకొస్తాం. పరిశ్రమలు తీసుకువచ్చి సహకారం అందిస్తే యువత అద్భుతాలు చేస్తోంది.

నిన్ననే నేను, పవన్ కల్యాణ్ ఆలోచించాం. యువతలో ఉన్న ప్రతిభను గుర్తిస్తాం. మీరు జీవితంలో ఏం కావాలని కోరుకుంటారో, ఆ దిశగా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇప్పించి సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారుచేసే బాధ్యత నాది. ఏదీ అసాధ్యం కాదు.. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టా.. నేను సాధన చేశాను ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాను ఐఏఎస్ అధికారులకు అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నాను.

ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి, పెద్దిరెడ్డి పెత్తనం ఏంటి?
తెలుగుదేశం పార్టీలో ఉత్తరాంధ్ర నేతలు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తుంటే.. వైసీపీలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి, పెద్దిరెడ్డి పెత్తనం సాగిస్తున్నారు. వీళ్లు మీకోసం మీపై ప్రేమతో ఉత్తరాంధ్రకు రాలేదు.. విశాఖపట్నంలో ఉండే భూములపై ప్రేమతో వచ్చారు. అనకొండల మాదిరిగా వచ్చి ఉత్తరాంధ్రలో భూములు కబ్జా చేశారు.. ఎక్కడిక్కడ దోచేశారు.అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ఆర్, జగన్ పాదయాత్ర చేశారు.. నేను అడ్డుకోవాలని చూస్తే వీళ్లు ముందుకు వెళ్లేవారా.. అడుగు ముందుకు పెట్టేవాళ్లా? కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులను ఎదుర్కోవడానికి, వారిని కాపడడానికి నిద్రలేని రాత్రుళ్లు గడిపా. కోర్టుల ద్వారా అక్రమ కేసులను చేధించి బయటకు తీసుకొస్తే.. మరొసారి అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. శుక్రవారం వస్తే ప్రతిపక్ష నేతల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు.

నా అక్రమ అరెస్ట్ సమయంలో కార్యకర్తలకుభువనేశ్వరి అండగా నిలిచింది
నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తే 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ బయటకు రానటువంటి నా భార్య భువనేశ్వరి కార్యకర్తలకు అండగా నిలవాలని బయటకొచ్చారు. “నిజం గెలవాలి” కార్యక్రమంతో 25 పార్లమెంట్లు 95 నియోజకవర్గాల్లో పర్యటించి నా అరెస్ట్ సమయంలో అధైర్యంతో ప్రాణాలు వదిలిన 203 కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా.. వారి కుటుంబాలకు భరోసానిచ్చారు. ఇవన్ని రాష్ట్రం కోసం.. ప్రజల శ్రేయస్సు కోసమే చేశాం. ఇలాంటి సమయంలో మాకు అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడకపోతే ఏమవుతుందోననేది ఒక్కసారి ఆలోచించాలి. జగన్ రెడ్డికి పదవి వ్యాపారం అయితే నాకు పదవి బాధ్యత.

మావి మూడు జెండాలు అయినప్పటికీ అజెండా ఒక్కటే.. అభివృద్ధి-సంక్షేమం-ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం
రాష్ట్రం కోసం మేము, మా నాయకులు త్యాగం చేశారు. పవన్ కల్యాణ్‍ని అడుగడుగునా అవమానించారు. శరీరకంగా బాధపెట్టడమే కాకుండా మానసికంగా వేధించారు. అన్ని విధాలుగా వేధించినప్పటికీ.. ఈ రాష్ట్రంలో వైసీపీని ఓడించే వరకు నా పట్టుదల వీడనని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కల్యాణ్. బీజేపీ కూడా అదే పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో పొత్తులు మా కోసం కాదు.. రాష్ట్రం నిలవాలి మీరు బాగుపడాలనే ఏకైక ధ్యేయంతో కలిశాం. మావి మూడు జెండాలు అయినప్పటికీ అజెండా ఒక్కటే.. అభివృద్ధి-సంక్షేమం-ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం.. దీనికి పూర్తిగా సహకరించాలని కోరుతున్నా. జీడిపప్పు ధరలు విపరీతంగా పడిపోయి ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 80 కేజీల బస్త రూ.16 వేల నుంచి రూ.7 వేలకు పడిపోయింది. ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జీడి పంటల కోసం బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా గిట్టుబాటు ధర కల్పిస్తాం.

భవిష్యత్తులో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తాం ప్రస్తుతం జగన్ రెడ్డి ఇస్తున్న సెంటు స్థలం, ఇళ్లు రద్దు చేయను.. మీరు కోరుకుంటే అదే ప్రాంతంలో నాణ్యమైన ఇళ్లు నిర్మిస్తాం. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వడమే కాకుండా నాణ్యమైన ఇళ్లు నిర్మిస్తాం. గతంలో ఇళ్లు నిర్మించుకుని నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందిస్తాం. టిడ్కో ఇళ్లకు రంగులేశారే తప్ప పూర్తిచేయకుండా లబ్ధిదారులను మోసగించారు. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించి న్యాయం చేస్తాం. వాగుల్లో, వంకల్లో శ్మశానంలో జగన్ రెడ్డి స్థలాలిచ్చి మోసం చేశారు. రూ.వేలు విలువ చేయని భూములను లక్షలు విలువ చేస్తాయని చెప్పి వారిని మోసగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇస్తున్న మొత్తం డబ్బులు కేంద్రం, నరేగా ఇస్తున్న నిధులే. కేంద్రం, నరేగా ఇస్తున్న రూ.1.80 లక్షల కంటే ఒక్కపైసా కూడా ఎక్కువ ఇవ్వలేదు.

జగన్ రెడ్డి మీకు ఇచ్చింది ఎంత.. మీ నుంచి దోచుకున్నది ఎంత
మీ నుంచి దొచుకున్న డబ్బు మీ నుంచి దోచుకున్న డబ్బులను రూ.లక్షకు ఒక లీటర్ రక్తం దోచుకున్నట్లు లెక్కకడదాం. మీకు ఇచ్చిన డబ్బులను రూ.లక్షకు ఒక పువ్వుతో లెక్కకడదాం. టీడీపీ ప్రభుత్వంలో రూ.60 ఉన్న మద్యం ధరను రూ.200 లకు పెంచి నాసిరకం మద్యం సరఫరా చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. మందుబాబుల నుంచి రోజుకు రూ.140 చొప్పున ఐదేళ్లలో రూ.2.50 లక్షలు దోచుకుంటున్నాడు జగన్ రెడ్డి. రెండున్నర లీటర్ల రక్తాన్ని జలగన్న తాగేస్తున్నాడు. మీ ఇంటి కరెంట్ బిల్లులు గతంలో రూ.200 వస్తే ప్రస్తుతం రూ.600-1000 వస్తున్నాయి. సరాసరి రూ.500 తీసుకున్నప్పటికీ.. ఐదేళ్లలో వాడకంని బట్టి రూ.30 వేల నుంచి లక్ష వరకు దోచుకుంటున్నాడు.

ఇందులో అరలీటర్ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు. రూ.70 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను రూ.110కి పెంచి లీటర్‍కు రూ.40 దోచుకుంటూ.. ఐదేళ్లలో రూ.1.30 వేలు దోచుకుంటూ 1.3 లీటర్ల రక్తాన్ని జలగన్న తాగేస్తున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇసుక, సిమెంట్, స్టీల్ ధరల్లో లీటర్లకు లీటర్ల రక్తాన్ని జలగన్న పీల్చేస్తున్నాడు. చెత్తపన్ను, వృత్తి పన్ను, రిజిస్టేషన్ ఛార్జీలతో భారీగా ప్రజలను దోచుకుంటున్నాడు.

మీకు ఇస్తున్న డబ్బు రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొ కుటుంబం మీద రూ.10 లక్షల అప్పు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి రూ.7 నుంచి రూ.10 లక్షల భారం మోపాడు. టీడీపీ హయాంలో రూ.2 వేలు పింఛన్ పెంచితే.. ఈ ప్రభుత్వం రూ.వెయ్యి మాత్రమే పెంచింది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.4 వేలకు పెంచి మీ ఇంటిదగ్గరకే ఇస్తాం. పింఛన్లలో సరాసరి రూ.30 వేలు ఇచ్చారు, అమ్మఒడి, ఆసరా, ఆటో డ్రైవర్లకు వస్తున్న డబ్బులు లెక్కేసి.. మీకు చెవిలో పెడుతున్న పూలు ఎన్ని.. మీ నుంచి జలగలాగా దోస్తున్న రక్తం ఎంత అన్నది మీరే ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి.

పడగొట్టి, చెడగొట్టి బాదపెట్టి హింసించేవాడు జగన్
బటన్ నొక్కాను అంటున్నాడు.బటన్ నొక్కడం పెద్దపనా? మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది. సంపద సృష్టించాలి. ఆ సంపద పేదలకు పంచాలి. రాష్ట్రనికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. విద్యా శాఖ, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ ఏ వ్యవస్థ అయినా పని చేస్తుందా ? సైకో జగన్ ఊరికొక గాలోడిని తయారు చేశాడు. డబుల్ ఇంజిన్ సర్కారుతో వస్తున్నాం. కేంద, రాష్ట్ర మ్యానిపెస్టోలు అమలు చేస్తాం. నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి వచ్చే 5 ఏళ్లలో చేసి చూపిస్తా.

కష్టపడి సంపద సృష్టించి పేదలకు వంచుతాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం.ఆధరణ పధకం కింద ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చొప్పున 5 వేల కోట్లు ఖర్చు చేస్తాం. భూ రక్షణ చట్టం . చట్టం ప్రమాదకరమైన చట్టం. ఆ చట్టం వస్తే మీ భూమి మీ పేరు మీద ఉండదు. మీ భూమి వేరేవాళ్ళ పేరుతో రాసుకుంటారు. మేము అధికారంలోకి రాగానే ఈ చట్టం రద్దు చేస్తాం. వైసీపీ పాలనలో జరిగిన భూ కబ్జాలపై విచారణ చేస్తాం. ఎవరి భూమి వాళ్ళకు పంచుతాం. అడవుల్లో ఉండాల్సిన జంతువులు రోడ్లపైకి రాకూడదు. సీదిరి అప్పల రాజు లాంటి జంతువుని ఓడించి శాశ్వతంగా అడవికి పంపాలి.

టీడీపీ అధికారంలోకి రాగానే మహేంద్ర ఆఫ్ షోర్ పూర్తి చేస్తాం. కిడ్నీ రీసర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.మీ తినే వంటపైకూడా రీసెర్చ్ చేయిస్తాం.. ఉధ్యాన వనాన్ని కాపాడుతాం. వంశదార కాలువ సిమెంటు లైనింగ్ వేస్తాం. పలాసలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేస్తాం. ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం. పలాసలో రైతు బజారు మూసేశారు, దాన్ని తెరిపిస్తాం. జీడీ బోర్డు డిఫెన్స్ అకాడమి, ఐ.యస్.ఐ ఆస్పత్రి స్కిల్ డెవలఫ్ సెంటరు ఏర్పాటు చేస్తాం. 1900 టిడ్కో ఇల్లు వూర్తి చేస్తాం. ఇక్కడ మీరంతా గౌతు శిరీషను గెలిపించాలి. సైకో జగన్ చెబితే ఇక్కడ అప్పలరాజు ఎగిరెగిరి పడుతున్నాడు. నా దగ్గర వేషాలు వేస్తే తోక కట్ చేస్తా.

జగన్ డ్రామాలు ప్రజలు నమ్మరు
గొడ్డలితో బాబాయిని చంపి నాపై నెట్టారు. కోడి కత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు గులకరాయి డ్రామా మొదలెట్టారు. మీ ప్రభుత్వంలో కరెంటు ఆగితే నేను బాధ్యుడినా? కరెంటు పోతే బస్సుపై ఎందుకు నిలబడ్డారు. లోపలికి సెక్యూరిటీ ఎందుకు తీసుకెళ్లలేదు? దాడి జరిగిన 10 నిమిషాలకే ఫ్లకార్డులతో ధర్నాకు కూర్చున్నారు. ఇది డ్రామా కాకపోతే మరేంటి? జగన్ డ్రామాలు ప్రజలు నమ్మరు. ఎస్సీ వర్గీకరణ చేస్తాం. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. నిండు మనసుతో కూటమిని ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు.

Leave a Reply