Suryaa.co.in

Andhra Pradesh

ముస్లిం ద్రోహి జగన్ రెడ్డి

-తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ నేతల భేటీ
-తగిన గుణపాఠం చెప్పే బాధ్యత ప్రతీ ఒక్క ముస్లీంపై ఉంది
– శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్

సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సోదరులు భేటి అయ్యారు. ఐదేళ్లుగా ముస్లీంలు పడుతున్న బాధలు తొలగాలంటే ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాలని ముస్లిం సోదరులు నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీష్ మాట్లాడుతూ…”ముస్లీంలందరూ ఏకమై జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీ సోదరులకు రక్షణ లేకుండా పోయింది. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఈ ఐదేళ్ళలో ముస్లీంలపై దాడులు జరిగాయి. ఐదేళ్ళలో ముస్లీంలకు ఏ ఒక్క సంక్షేమ పథకం అందలేదు. ముస్లిం సంక్షేమంకై ఎన్నో పథకాలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలను నిలిపివేసి ముస్లీంలను అణగదొక్కే ప్రయత్నం చేసింది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మాట తప్పి మడమ తిప్పింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం.

వక్ఫ్ భూములను కబ్జా చేశారు. ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనం ఐదేళ్ళలో ఏ ఏడాది ఇవ్వకుండా ఎన్నికల దగ్గరపడుతుండడంతో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పుడు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు. ముస్లీంలకు తీరని అన్యాయం చేసిన జగన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చేప్పాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంది. అన్ని విధాలా మనకు అండగా నిలిచే ఎన్డీఏ కూటమికి ఓటు వేద్దాం ముస్లిం కమ్యునిటీని కాపాడుకుందాం” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఏ షరీఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్, రాష్ట్ర అధికార ప్రతినిధి, సయ్యద్ రఫీ, టిడిపి మైనారిటి విభాగం అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, టిడిపి ఆహ్వాన కమిటీ సభ్యులు హాజీహసన్ భాషా, టిడిపి నాయకులు ఎస్పీ సాహెబ్ తో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE