Suryaa.co.in

Andhra Pradesh

క్లారిటీ లేకుండానే అరచేతి మందంగల రాయి అని సీపీ ఎలా చెప్పగలరు?

-పోలీసు ఆఫీసరుగా ఉండేందుకు విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా అనర్హుడు
-సీఎంపై దాడి జరిగి 48 గంటలు గడుస్తున్నా పోలీసులు సోదించి సాధించింది ఏంటి?జగన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి హత్యాయత్నమే అయితే చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి కూడా హత్యాయత్నమే కదా..!
-చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి కేసు ఏమైందో, ఎంత వరకు వచ్చిందో డిజిపి సమాధానం చెప్పాలి
-పోలీసుల భద్రతా వైఫల్యమే జగన్ రెడ్డిపై జరిగిన దాడికి కారణం
– ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మహన్ రెడ్డిపై శనివారం జరిగిన దాడికి సంబంధించి 48 గంటలు సోదించి సాధించి తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్టును విజయవాడ పోలీసు కమిషనర్ ప్రెస్ మీట్‌లో చదివి వినపించాడని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మండిపడ్డారు.

సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…”జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి జరిగి 48గంటలు అయినా, 8 టీమ్‌లు దర్యాప్తు చేస్తున్నా ఇంతవరకు ఒక్క సాక్ష్య కూడా సంపాదించలేకపోయారు. అసలు విజయవాడ పోలీసులు కమిషనర్ ప్రెస్ మీట్ చూస్తే అతని పోలీసు అధికారి ఎలా అయ్యాడని ప్రజలు తికమకపడుతున్నారు. ఒక వైపు విడియో కపాసిటీ తక్కువగా ఉంది రాయి సైజు కనుక్కోలేకపోయామని చెప్పేది కమిషనరే మరోవైపు రాయి అరచేతి సైజు ఉంది జగన్ రెడ్డి నుదుటికి రాసుకొని వెళ్ళి పక్కనే ఉన్న వెల్లంపల్లి కంటికి తగిలిందని చెబుతున్నారు. అంతవివరంగా కమిషనర్ చెబుతుంటే దానికి సంబంధించిన విడియో ఫూటేజ్ కూడా ఉండాలి కదా? పూర్తిగా పోలీసు భద్రతా వైఫల్యమే జగన్ రెడ్డిపై జరిగిన దాడికి కారణం.

దానిని కప్పిపుంచుకునేందుకే విజయవాడ సీపీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకుంటున్నారు. ఎయిర్ గన్ కాదు, క్యాట్ బాల్ కాదు ఎవరో బలంగా విసిరిన అరచేతి మందంగల రాయి అని, గాయం బలంగ అయ్యిందని సీపి స్పష్టంగా చెప్పారు. జగన్ రెడ్డి ఉన్న బస్సుకు రాయి విసిరిన భవనానికి ఇంచుమించు 30 నుంచి 40 మీటర్లు ఉంటుంది. అరచేతి మందంగల రాయిని అంత దూరం గురి చూసి విసరడం సాధ్యమేనా? పోలీసులు 48 గంటలు సోదించి సాధించింది ఏంటి? 8 బృందాలను పెట్టి సోదింస్తున్నామని చెప్తున్నారు కానీ ఎవరో ఒక అనమకుడిని నిందుతుడిగా చూపిస్తారేమోనన్న సందేహం మాలో ఉంది” అని అన్నారు.

48 గంటలు సోదించి రాయి సైజును కూడా కనుక్కోలేక పోయారు…
“ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఏ ఒక్క చెట్టును నరకని పోలీసులు జగన్ రెడ్డి భద్రత కోసం చెట్టులను కొట్టేస్తారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా తీగలు తొలగించడం, చెట్టులు నరకడం భద్రతలో భాగమంటున్నారు. సీఎం రోడ్ షో నడుస్తుంటే చుట్టుపక్కల బిల్డింగ్‌లపై కానిస్టేబుల్‌నైనా పెట్టాలి. కానీ అలా చేయలేదు. పథకం ప్రకారమే కరెంట్ నిలిపేశారు. కరెంట్ లేనప్పుడు బస్సు మీద సీఎం ఉంటే ఫ్లడ్ లైట్స్ ఉండాలన్న ప్రోటోకాల్ పోలీసులకు తెలియదా..? తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్టునే సీపి చదివారు. నిజంగా రాయి దాడి జరిగిందా..!, దండలా ఏదైనా తగిలిందా..! వెల్లంపల్లికి మాత్రమే తగిలిందా..! అనే సందేహాలకు సీపీ వివరణ ఇవ్వలేదు. కేవలం అరచేతి మందం రాయి అంటూ ఒక్క విషయాన్ని 48 గంటల్లో కనిబెట్టారు” అని అన్నారు.

చంద్రబాబుపై రాళ్ల దాడి కేసు ఎంత వరకు వచ్చిందో డిజిపి సమాధానం చెప్పాలి….
“ముఖ్యమంత్రిపై హత్యాహత్నం అని వైసీపీ నాయకులు ఊదరకోడుతున్నారు. జగన్ రెడ్డిపై రాయి దాడి నిజంగా హత్యాహత్నమే అని పోలీసులు నమ్మితే నాడు చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి హత్యాయత్నమే అవుతది కదా? కానీ చంద్రబాబుపై జరిగిన దాడికి సంబంధించిన కేసు ఏమైందో తెలియదు, విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియదు. కానీ జగన్ రెడ్డిపై ఎవరో ఒక అజ్ఞాతవ్యక్తి రాయి విసిరినందుకు హత్యాహత్నం అంటూ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబుపై జరిగిన దాడి కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో డిజిపి వివరణ ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.

దాడి జరిగిన 3 గంటల దాక జగన్ రెడ్డి ఎందుక ఆసుపత్రికి వెళ్ల లేదు?
జగన్ రెడ్డిపై దాడి 8:04 నిమిషాలకు దాడి జరిగితే రాత్రి 11 గంటల వరకు ఆసుత్రికి ఎందుక వెళ్ల లేదు? నాడు కోడి కత్తి దాడి జరిగినప్పుడు పోలీసుల, వైద్యులపై నాకు నమ్మకం లేదని హైదరాబాద్‌కు వెళ్ళిపోయిన జగన్ రెడ్డి నేడు దాడి జరిగిన 3 గంటల వరకు ఆసుపత్రికి వెల్లకపోవడంలో అంతర్యం ఏంటి? పెద్ద సర్జరీ జరిగినట్లు మీడియా కవరేజి ఇచ్చారు. జగన్ రెడ్డి నిజంగా గాయం పెద్దదే అయిఉంటే ఎందుకు వెంటనే ఆసుపత్రికి వెళ్లలేదు?

పోలీసులు ఏ విధంగా స్పందించారో అందరూ చూశారు. కానీ ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఈ విధంగా ఎందుక స్పందించలేదు. గత ఐదేళ్ళుగా పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు ఆఫీసరుగా విజయవాడ సీపి కాంతి రాణా అనర్హుడు. గట్టి అందరూ పట్టుపడితే ఎవరో ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఇతనే నిందుతడని లోకానికి చూపించి మరో శ్రీనును తయారు చేస్తారు. పోలీసులు ఎంతలా వైఫల్యం చెందారో ఈ సంఘటనులే నిదర్శనం” అని దుయ్యబట్టారు.

దాడి జరిగిన సమయంలో డ్రోన్‌లు ఎందుకు దించేశారు?
“ఎక్కడా ఏ మీటింగ్ జరిగినా జనం లేకపోయినా జనం ఉన్నట్లు చూపించుకోవడానికి డ్రోన్‌లను ఎగరేసి డబ్బాలు కొట్టుకునే వారు, దాడి జరిగిన సమయంలో ఎందుకు డ్రోన్‌లను దించేశారు? రాయి దాడి ఏదో ప్రపంచ విపత్తులా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. బాబాయిని చంపేసి గుండె పోటు అన్నారు కానీ హత్య అనలేదు. ఇవి అన్నీ ప్రజలు గ్రహించారు. వైసీపీ నాయకులు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఓడి పోతున్నామనే భయంతోనే జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు” అని విమర్శించారు.

నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పోలీసులకు నా విజ్ఞప్తి….
“జగన్ రెడ్డి మాకు ప్రత్యర్ధైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అతని భద్రత గురించి ఆలోచిస్తున్నాం. అధికారులు నిజాయితీపరులైతే జరిగిన ఘటనలో పొరపాటు ఎక్కడ జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలయజేయాలి. ఈ ఘటనపై డిజిపి ఇంతవరకు ఏం మాట్లాడుకోవపోవడం ఆశ్చర్యంగా ఉంది. దిగజారుడు రాజకీయాలు చేయోద్దని పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాం. ఏ పార్టీకి చెంగు పట్టుకోకుండా జరిగిన ఘటనలో నిజాయితీగా విచారణ జరిపి అసలైన నిందుతుడిని పట్టుకుంటే ముందుగే పోలీసు వ్యవస్థను తెలుగుదేశం పార్టీ అభినందిస్తుంది” అని అన్నారు.

LEAVE A RESPONSE