Home » జగన్ రెడ్డి చేతిలో సీఎస్, డిజిపి, ఏడిజి పిట్టలు

జగన్ రెడ్డి చేతిలో సీఎస్, డిజిపి, ఏడిజి పిట్టలు

– కీలక పత్రాలను దగ్ధం చేసిన కొల్లి రఘురామిరెడ్డి
– గులకరాయి డ్రామా ఫెయిల్ అవ్వడంతో తలలు పట్టుకున్న వైసీపీ నేతలు
సీబీఐ దర్యాప్తు చేస్తే సీఎంపై రాళ్ళ దాడి డ్రామా అని బట్టబయలవుతదేమోనని వైసీపీ నాయకులకు భయం
– సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై గవర్నర్‌కు ఎన్డీఏ నేతలు ఫిర్యాదు

శనివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై సిబిఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎన్డీఏ నేతలు ఫిర్యాదు చేశారు. రాళ్ల దాడి ఘటనపై రాష్ట్ర పోలీసులు ద్వారా న్యాయం జరగదని కేవలం సిబిఐ దర్యాప్తు చేస్తేనే నిజమైన నిందుతుడికి శిక్ష పడతదని గవర్నర్‌కు ఎన్డీఏ నేతల వివరణ. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ నేతలు మాట్లాడుతూ…

గులకరాయి డ్రామా… ఇదో పెద్ద స్టేజ్ మ్యానేజ్డ్ డ్రామా: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
“జగన్ మోహన్ రెడ్డి ఆడిన గులకరాయి డ్రామాపై మేము గవర్నర్‌కు స్పష్టంగా తేటతెల్లం చేశాం. జగన్ రెడ్డిపై దాడి హత్యాయత్నం కాదు. ఓడిపోతున్నానని అర్థమయ్యి, మాకొద్ది బాబు ఈ జగన్ అని ప్రజలు తిరగబడుతున్నారని ఎన్నికల్లో సానుభూతి సంపాదించడానికే గులకరాయి డ్రామాకు తెర లేపాడు. కరెంటు పోతే ఏ విఐపిని అయినా సెక్యూరిటీ ఆఫిసర్లు విఐపి తలపై చెయ్యి పెట్టి బలవంతంగా కింద కూర్చోపెడతారు. కానీ శనివారం రాత్రి జరిగిన ఘటనలో సెక్యూరిటీ ఆఫిసర్లందరూ కింద కూర్చున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం నుంచొని రాయి కోసం వేచి చూస్తున్నట్లు వ్యవహరించారు. ఇది స్టేజ్ మ్యానేజ్డ్ డ్రామా అని అందరికీ తెలుసు.

రాయి జగన్ రెడ్డిపైకి వస్తుందని కెమెరా మ్యాన్‌కి కూడా తెలుసు. అందుకే జగన్ రెడ్డిపై ఉన్న కెమెరా రాయి వైపు కూడా తిరిగింది. ఈ డ్రామా అంతా ప్రజలకు అర్థమయ్యింది. ఈ ఘటనపై ప్రజలెవ్వరూ మాట్లాడుకోవడం లేదు. డ్రామా ఫెయిల్ అయ్యిందని వైకాపా నాయకులు సిగ్గుతో తలదించుకున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై విజయవాడ పోలీసు కమిషనర్ దర్యాప్తు చేస్తే న్యాయం జరగదు.

కోడి కత్తి డ్రామాలో శ్రీనును ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టినట్లు ఇప్పుడు గులకరాయి డ్రామాలో కూడా ఒక అమాయకుడిని అరెస్టు చేసి అతనే రాయి వేశాడని విజయవాడ పోలీసు కమిషనర్ తీసుకువస్తాడు. అందుకే సిబిఐ దర్యాప్తు చేస్తేనే బహిరంగంగా డ్రామా బట్టబయలవుతది. ఇదే విషయాన్ని గవర్నర్‌కు విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా గులకరాయి డ్రామా కేసును సిబిఐకు అప్పగిస్తారని మేము ఆశిస్తున్నాం” అని తెలిపారు.

ముందు జాగ్రత్త చర్యగానే కీలక పత్రాలను దగ్ధం చేసిన కొల్లి రఘురామిరెడ్డి…
చంద్రబాబు నాయుడు అక్రమ కేసుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను మార్చి 28న కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో దగ్ధం చేసిన ఘటనను కూడా గవర్నర్‌కు తెలియజేశాం. ఎంత పెద్ద అధికారైనా కేసుకు సంబంధించిన ఏ పత్రాలను దగ్ధం చేసే అధికారం లేదు. కానీ కావాలనే కొల్లి రఘురామిరెడ్డి రేపు అస్సోంకు వెళ్తున్నాడని, రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుందని గ్రహించి, తాను చేసిన తప్పులు బయటపడతాయెమో అని భయపడి ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసుకు సంబంధించిన పత్రాలను దగ్ధం చేయించాడు. ఈ విషయాన్ని కీలకంగా పరిగణించి సమగ్ర దర్యాప్తు చేయించి కట్టుదిట్టమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండని గవర్నర్‌ను విజ్ఞప్తి చేశాం.

జగన్ రెడ్డి చేతిలో చిక్కిన పిట్టలు వీరే….
డిజిపిగా రాజేంద్రనాధ్ రెడ్డి ఉన్నంతకాలం ఎన్నికలు ప్రశాంతంగా జరగవు. జగన్ రెడ్డి చేతిలో చిక్కిన పిట్ట డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, కోకిల పి.ఎస్.ఆర్ ఆంజనేయులు. వీలిద్దరికి వంతనపాడే గువ్వ పిట్ట సీఎస్ జవహర్ రెడ్డి. ఇంద అపవాదులు మోస్తూ విధులు చేయాల్సిన అవసరం, తలదించుకొని పని చేయాల్సిన అవసరం వీరికి ఏముంది? అందుకని ఈ ముగ్గురిని ఎన్నికల విధుల నుంచి తప్పించి దూరంగా పెట్టాలని గవర్నర్‌ను కోరాం” అని వర్ల రామయ్య తెలియజేశారు.

క్యారెమ్ బోర్డులో ఒక కాయిన్‌ను కొడితే రెండు కాయిన్స్‌కు తగిలినట్లు ఉంది: జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు
“ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే వ్యవస్థలో పనిచేసే అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ మన రాష్ట్రంలో అధికారులు ఈ రోజుకు కూడా పక్షపాతంగా వ్యవహిరిస్తున్నారు. వారి వల్ల ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని ప్రజాస్వామ్యాన్ని కాపాడండని గవర్నర్‌ను కోరాం. 2012లో కోడి కత్తి డ్రామా అయిపోయింది. సర్వేలన్నీ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయని జగన్ రెడ్డికి అర్థమయ్యిపోయింది. ఎన్నికలు అవ్వగానే దుకాణం సర్దుకొని రాష్ట్ర విడిచి వెళ్ళేందుకు జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ సీఎంగా లేకపోవడంతో హైదరాబాద్ పారిపోయేందుకు కూడా జగన్ రెడ్డికి అవకాశం లేకుండా పోయింది.

ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో విజయవాడలో డ్రామాకు తెర లేపారు. ముఖ్యమంత్రి రోడ్ ఫో చేస్తున్న సమయంలో కరెంటు పోవడం మొట్ట మొదటి సారి చూస్తున్నాం. రాయి దాడి జరిగిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటేనే ఇదంతా డ్రామా అని ప్రజలకు అర్థమయ్యింది. క్యారెమ్ బోర్డులో ఒక కాయిన్‌ను కొడితే రెండు కాయిన్స్‌కు తగిలినట్లు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి సీఎంపై రాయి విసిరితే వెల్లంపల్లికి కూడా తగిలిందంటా..!

గవర్నర్ డబ్బుతో ఏసీ బస్సు తయారు చేయించుకొని ఎక్కడా కూడా బస్సు ఎక్కని వ్యక్తి విజయవాడలో పథకం ప్రకారం బస్సు పైకి ఎక్కి నటించాడు. కోడ కత్తి కేసు నిజమైనదే అయితే కోర్టుకు వెళ్ళి జగన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి. కానీ సాక్ష్యం చెప్పడానికి ఇంతవరకు కోర్టుకు ముఖ్యమంత్రి వెళ్ళకపోవడం చూస్తుంటేనే అదంతా డ్రామా అని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ గులకరాయి డ్రామా కూడా మొత్తం బట్టబయలైపోయింది. ఇలాంటి డ్రామాలు ఆడితే వైసీపీ నాయకులే అబాసు పాలవుతారు.” అని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

ఓట్లు గుంజుకోవాలని వైసీపీ నాయకులు డ్రామాలు: తెదెపా పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్
“ఎన్నికల్లో ఓడిపోతున్నాడని అర్థమయ్యే భయంతో గులకరాయి డ్రామా ఆడుతున్నారు. దర్యాప్తు చేయకుండానే హత్యాయత్నం కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ప్రజలను మభ్య పెట్టి, ఓట్లను గుంజుకోవాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగితే ఇంత వరకు కేసులో పురోగతే లేదు. దీనికి మూల్యం జగన్ రెడ్డి తప్పించుకోకుండా తప్పదు” అని ఎంఏ షరీఫ్ హెచ్చరించారు.

2019లో కోడి కత్తి డ్రామాలానే 2024లో గులకరాయి డ్రామా: మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణ
“ఎన్నికలు సమీపిస్తున్నప్పుడల్లా జగన్ రెడ్డిపై హత్యాయత్నం జరుగుతుంటాయి. 2019లో కోడి కత్తి డ్రామా ఆడి శ్రీనును ఐదు సంవత్సరాలు జైలులో ఉంచారు. కోర్టుకు వెళ్ళి జగన్ రెడ్డి సాక్ష్యం చెప్పడానికి తీరుకు లేదు. ఎందుకంటే కేసు తెలితే జగన్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలకు తెలసిపోతదేమోనని భయం జగన్ రెడ్డికి ఉంది. తనని తాను కాపాడుకోలేని ముఖ్యమంత్ర రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఏం కాపాడగలరు? కేవలం సానుభూతి కోసమే జగన్ రెడ్డి రాయి దాడి చేయించుకున్నాడని ప్రజలు అనుమానిస్తున్నారు.

రాష్ట్ర పోలీసు వ్యవస్థపై మాకు నమ్మకం లేదు. ఈ దాడి ఘటనపై సిబిఐ విచారణ జరింపించాలి. చంద్రాబాబు అక్రమ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను కావాలనే కొల్లి రఘురామిరెడ్డి తగలబెట్టించాడు. చంద్రబాబు నిర్దోషని నిరూపించే పత్రాలు కాబట్టే వాటిని దగ్ధం చేశారని మా అనుమానం. చంద్రబాబు ముద్దాయని ఆధారలేమి లేవని బెయిల్ ఇచ్చిన జడ్జే చెప్పారు. పత్రాలు దగ్ధం చేయడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని గవర్నర్‌ను కోరాం” అని కొనకళ్ళ నారాయణ తెలిపారు.

గవర్నర్‌ను కలిసిన వారిలో తెదెపా పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply