Suryaa.co.in

Andhra Pradesh

కంటైనర్ కి ఎన్నికల సంఘం అనుమతి

– సీఎం జగన్ బస్సు యాత్రలో ప్యాంట్రీ కోసం ఆర్టీసి నుండి నిబంధనల ప్రకారం కంటైనర్ తీసుకున్నాం.
– కంటైనర్ లో ఏదో ఉంది అని దివాళాకోరుతనంతో మాట్లాడుతున్నారు
– మాట్లాడటానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
– సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రకు ప్రజల ఆశీస్సులు మెండు
– వైయస్సార్ సిపి అధికారంలోకి రావడం ఖాయం
– కూటమి ఏర్పాటు తరువాత ప్రజలు మరింతగా వైయస్సార్ సిపి వైపు నిర్ణయం తీసుకున్నారు
– తనను కలసిన మీడియా ప్రతినిధులతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైయస్సార్ సిపి అనగానే ప్రజలలో ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుంది. అంతకుముందు సిధ్దం సభలకు కూడా అలాగే ఉంది.అనుకున్నదాని కంటే మిన్నగా మా ప్రభుత్వం డెలీవర్ చేయడం వల్ల అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ ధీమాతో అయితే రిక్వెస్ట్ చేశారో నేను మంచి చేశానని భావిస్తే ఆశీస్సులు ఇవ్వండి…అది నిజమని తేలింది.ప్రజలు ఎంతగా జగన్ పై నమ్మకం ఉంచారో కనిపిస్తోంది అని వివరించారు.రానున్న రోజులలో మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం కార్యాలయంకు వచ్చిన కంటెనైర్ పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి ప్రచారం కోసం ఆర్టీసి నుంచి అధికారికంగా తీసుకున్న వాహనం అది.ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయడం జరిగింది.దానికి ఈసి నుంచి ప్యాంట్రీ కార్ కోసం అనుమతి పత్రం ఇచ్చింది.చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎం వాహనాలకు సంబంధించి అనుమతులు తీసుకుంటారని తెలిసీ కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై లోకేష్ ట్వీట్ చేయడం పై మాట్లాడుతూ తండ్రికొడుకులు ఇద్దరూ దుర్వినియోగం చేసినట్లు ట్వీట్టర్ ఫ్లాట్ ఫామ్ ను ఎవరూ దుర్వినియోగం చేసి ఉండరు అని సజ్జల విమర్శించారు. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా వారి వైఖరి ఉందన్నారు.
శ్రీకాళహస్తిలో మా పార్టీ అధికారికంగా తీసుకున్న గౌడౌన్ లో టాక్స్ లు కట్టి తెచ్చిన సరుకు పెట్టుకున్నా కూడా నానా యాగి చేసారు. చివరకు మా పార్టీ ఆఫీసుకు కూడా వస్తారేమో అన్నట్లుగా ఉంది.అప్పుడు మేం కూడా టిడిపి కార్యాలయంకు వెళ్లాలేమో అని వ్యాఖ్యానించారు. ఆర్టీసిలో ప్యాంట్రీ కార్ అధికారికంగా తీసుకున్న,బిల్లులు చెల్లించి ప్రచార సామాగ్రి తెచ్చినా దానిపై తప్పుడు ఫిర్యాదులు ఇచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు.వారికి మీడియా ఉంది కదా అని ఇలా చేస్తున్నారని విమర్శించారు.

బిజేపి అడిగితేనే మేం పొత్తుకున్నామని చంద్రబాబు చెబుతున్నారంటూ అనే అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. పొత్తుకోసం చంద్రబాబు వెంపర్లాడిన విషయం లోకానికంతటికి తెలుసున్నారు. నరసాపురం ఒక్కటి కూడా రఘురామరాజుకు ఇచ్చి ఉంటే బిజేపికి ఇచ్చిన ఎంపీ స్దానాలన్నీ చంద్రబాబే డిసైడ్ చేసినవే వచ్చినట్లు ఉండేది.అది ఎందుకో ఇవ్వలేదు. అలా జరిగిఉంటే ఎన్నికలలో రిజల్ట్స్ తేలిసేది.

మిగిలిన వాటిలో కూడా చూస్తే బిజేపి లో ఉన్న టిడిపి ఏజంట్లతో నింపించారని మీడియాలో వస్తున్న కధనాలు చూస్తే అర్దమయిపోతుందన్నారు. మూడు కోట్లు ఇస్తే స్దానం మారుస్తామని ఆడియో కూడా బయటకు వచ్చిందని అన్నారు. జగన్ పాలనలో బ్రహ్మాండమైన అభివృధ్ది జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టే వైయస్సార్ సిపిని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు సిధ్దమయ్యారని అన్నారు

LEAVE A RESPONSE