ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడమేనా?

– కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదు
– అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు.. కేసులతో నోరునొక్కడమా?
– చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులు ఎలా పెడ్తారు?
– హిందువులను హింసించి దేశాన్ని నాశనం చేసేవాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి
మాఫియాకు వంతపాడటం ఎంతవరకు సమంజసం?
– రాష్ట్ర సర్కారు, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజం

చంగిచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ , కార్యకర్తలను అడ్డుకోవడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేయడం,.. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ని హౌస్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

చెంగిచెర్ల వెళ్లి బాధితులను పరామర్శించేందుకు వెళ్తానంటే బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ గారిని హౌస్ అరెస్టు చేయడంతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిపై అక్రమంగా కేసు నమోదు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నాం. దెబ్బలు తిన్నవారిపై కేసులు నమోదు చేయడం ఏమాత్రం సబబు కాదు. అక్కడికి ఇతర పార్టీల నేతలు పోవచ్చు కానీ బీజేపీ నాయకులపై ఆంక్షలు విధించడం ఏంటి..?

ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమ అరెస్టులు.. కేసులతో నోరునొక్కడమా..? హోలీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగింది. చాలా మంది మహిళలు, యువత గాయపడ్డారు. దాడి చేసిన వాళ్లను వదిలి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న వాళ్లపై హత్యాయత్నం కేసు పెడతారా? చెంగిచర్ల ఏమైనా నిషేధిత ప్రాంతమా? బారికేడ్లు పెట్టి మరీ స్లాటర్ హౌస్ నడుపుతున్న మాఫియాకు వంతపాడటం ఎంతవరకు సమంజసం..?

చంగిచర్లలో అక్రమ స్లాటర్ హౌస్ ను తొలగించాలి. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు ఉపసంహించుకోవాలి. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాల్సిందే. బాధితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. స్టేట్ మెంట్ పేరుతో మహిళలను గుంజుకుపోయి కొట్టారు. పోలీసుల దుర్మార్గ చర్యలతో బాధిత గిరిజన మహిళలు మంచానికే పరిమితమై గాయాలతో బాధపడుతున్నారు.

కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన, అనారోగ్యకరమైన, అనాలోచిత విధానంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా హింసాత్మకంగా వ్యవహరించిన వారిని వెనకేసుకువస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం కాంగ్రెస్ కు అలవాటే.. అధికార ఉన్మాదంతో రగిలిపోతోంది.

కాంగ్రెస్ మతోన్మాదంతో, ఉద్వేగాలతో, అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతో దేశం కోల్పోయింది చాలు. ఇప్పటికైనా కాంగ్రెస్ తీరు మార్చుకోవాలి. హిందువులను హింసించి దేశాన్ని సర్వనాశనం చేసేవాళ్లకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉండాలె. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మత చిచ్చు రాజేసేందుకు బీజం వేసింది.

కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ.. బీఆర్ఎస్ సర్కారు తీరుతో దివాళా తీసింది. ఎక్కడకక్కడ నిర్భాందాలతో, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులతో, దర్నా చౌక్ ఎత్తివేసి మరీ నిర్బంధకాండను కొనసాగించింది. అందుకే ప్రజలు నియంతృత్వ, అహంకారపు బీఆర్ఎస్ రజాకారు పాలనను చీత్కరించారు. ఇప్పుడు కాంగ్రెస్ చేతికి అధికారం అప్పజెప్పితే.. ఆ పార్టీ బుద్ధి మార్చుకోలేదు. కాంగ్రెస్ కు కూడా బీఆర్ఎస్ కు పట్టిన గతే పట్టడం ఖాయం.

కాంగ్రెస్ ప్రభుత్వం చంగిచర్లలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు నీచ రాజకీయానికి ఒడిగట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరిస్తున్నాం.. చెంగిచర్లలో బాధితుల తరఫున నిలుస్తున్న బీజేపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులతో భయపెట్టాలనుకున్నా అంతకు రెట్టింపు దిశలో ప్రజాస్వామ్యపక్షంగా బుద్ధిచెబుతాం.

Leave a Reply