50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం

ఇంత లేటు వయసులో కూడా పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఓ ఆడబిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఓ బిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం అతడి భార్య డా. గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చినట్లు మాన్, సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, మాన్‌కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. తర్వాత 2022 లో సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Leave a Reply