Suryaa.co.in

Andhra Pradesh

నరకాసుర పాలనకు అంతం పలకాలి

-ఇడుపులపాయ నుంచి మొదలైన బస్సు యాత్ర తుస్సుమంది
-రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలి
-ఆలోచించి ఆత్మసాక్షితో ఓటెయ్యాలి
-జనం రక్తాన్ని పీల్చే జగన్ సర్కార్ ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

మైలవరం: సీఎం జగన్ సిద్ధం కార్యక్రమం ఫ్లాప్ షో అయిందని, డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఎద్దేవా చేశారు. ఒక్క అవకాశం అని అందరికీ ముద్దులు పెట్టి ఆ తర్వాత ప్రజలను ఇబ్బందికి గురిచేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే నరకాసుర పాలనకు అంతం పలకాలన్నారు.

పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల దోచేశాడని విమర్శించారు. సాగునీటి రంగాన్ని నాశనం చేసి, రాయలసీమకు తీరని ద్రోహం చేశాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలన్నారు. జనం రక్తాన్ని పీల్చే వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు . సొంత ఇలాకాలోనే జగన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారని, ఇడుపులపాయ నుంచి మొదలైన బస్సు యాత్ర తుస్సుమందన్నారు.

రోడ్ షోలో మచ్చుకైనా కనిపించని జనం లేరని, అధికార దుర్వినియోగంతో బెదిరించినా జనం రాకస భాప్రాంగణం వెలవెలబోయిందన్నారు. బాబాయిని ఎవరు చంపారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నీ పాలనలో న్యాయం జరగదని నీ చెల్లెల్లే ప్రజాతీర్పు కోరారని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో కలిగిన ఇబ్బందులను ప్రజలు మరవలేదని వివరించారు. ఇప్పుడు రాష్ట్రానికి చాలా కీలకమైన సమయం అని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

ఐదేళ్ల నరకాసుర పాలనకు చెక్ పెట్టే సమయం ఇది అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని గుర్తుచేశారు. వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని తెలిపారు.

LEAVE A RESPONSE