అమరావతి:వన్ ఛాన్స్ అంటూ వచ్చి, కలెక్షన్స్ కోసం పేదలను వన్ టైమ్ సెటిల్మెంట్ అంటూ వన్ టైమ్ సీఎంగా జగన్ మిగిలి పోబోతున్నారని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో పేదల ఇళ్ల పైన రుణాలు రద్దు చేస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని రద్దు చేశారన్నారు. ఎప్పుడో పుట్టిన పిల్లవాడికి అతని పెళ్లి సమయంలో బారసాల చేసినట్టు జగన్ పాలన తీరు ఉందన్నారు. ఇంకా లంకా దినకర్ మాట్లాడుతూ.. ‘‘పేదల గృహాల పైన ఓటీఎస్ ఐచ్ఛికం అనే వారు ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లు ఎందుకు? పథకాల రద్దు బెదిరింపుల మాటేమిటి? ఆస్తి హక్కు పత్రాల పైన హక్కుదారుల ఫోటో ఉండాలి కాని జగన్ ఫోటో కాదు. రాష్ట్రంలో అందరి ఆస్తులకు ఆయనే హక్కుదారు కావాలను కుంటున్నారా? రాష్ట్ర ప్రజలు జగన్ పాలనకి వన్ టైమ్ సెటిల్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు.