2024 తర్వాత రాజకీయాలకు గుడ్‌బై

Spread the love

– ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించా
– ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి ఓ జిల్లా ఎస్పీకి నెలకు రూ. 5 ఐదు కోట్లు
పోలవరం గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీలేదు
– ఈనెల 28న భారీ నిరసన
– – బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
విజయవాడ.: 2024 ఎన్నికల తర్వాత తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. సహకారం రంగంలోని డైరీలు, పంచదార మిల్లులను అమ్మేసే మీరు బిజెపిని పల్లెత్తు మాట అనే అర్హత లేదు. బిజెపి కి వ్యతిరేకంగా కోరస్ పాడే కమ్యునిస్టులు నోట్లు మన్నుపెట్టుకున్నారా అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుచుగా తెరపైని సంబందంలేని అంశాలు ప్రస్తావిస్తు బిజెపి ని విమర్శించాలని పనిగా పెట్టుకుంటున్నారని తీవ్రస్వరంతో సోమువీర్రాజు వైసిపి, తెలుగుదేశం, కమ్యూనిస్టులను ఏకకాలంలో ప్రస్తావించారు. ఒక్కొక్క పార్టీ ఒక్కో అంశంలో ఏవిధంగా వ్యవహరించారో అన్న విషయాలను స్వరం పెంచి వివరించారు.
పాలక ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాను దమ్ముందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఉంది .18 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలిస్తుంది .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ఇవ్వాలని అడుగుతున్నానేను ఏనాడు పదవులు ఆశించి రాజకీయం చేయలేదు. బిజెపి ఎమ్మెల్యేలను గెలిపించాను. ఎంపిలను గెలిపించాను. మాకు దేశం ముఖ్యం ఆతరువాతే పార్టీ మాకు అందుకే పార్టీ సిద్దాంతం ఆధారంగా పనిచేసే పార్టీ మాది అని వివరించారు.
భారతీయ జనతా పార్టీకి పాలించే సత్తా ఉంది కాబట్టి అధికారం ఇవ్వాలి.నాకు పదవుల మీద వ్యామోహం లేదు.42 సంవత్సరాల నుంచి ఈ రాజకీయ వ్యవస్థల్లో పనిచేస్తున్నా. 2024 తరువాత నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.అన్నమయ్య ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తే షెకావత్తును తప్పు పడతారా..?మా ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్ రాసిస్తే చదివే మంత్రా షెకావత్. షెకావత్తుకు ఏం తెలీదని ఈ ప్రభుత్వం అనుకుంటోందా..?తప్పు జరిగితే చర్యలు తీసుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తారా..?ఇదే కేంద్ర మంత్రి షెకావత్ పుట్టిన రోజు పండుగలు ఇదే నేతలు చేయలేదా..?బీజేపీ నేతలకు కూడా చెప్పకుండా షెకావత్తుని శ్రీకాళహస్తి తీసుకెళ్లి పూజలు దగ్గరుండి ఈ అధికార పార్టీ నేతలే చేయించలేదా..?
అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన అంశంపై ఇప్పుడేదో తూతూ మంత్రంగా విచారణ కమిషన్ వేశారు. వరదల్లో ఆప్రాంతానికి వెళ్లిన తొలివ్యక్తిని నేను. న్యాయ విచారణ కు డిమాండ్ చేశాను ఇదే అంశం పై ముఖ్యమంత్రి కి లేఖ కూడా రాసానని వివరించారు.అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి.స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారని తెగ విమర్శలు చేస్తారా..?రాష్ట్రంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలని మూసేయలేదు..?షుగర్ ఫ్యాక్టరీలను.. డెయిరీలను.. స్పిన్నింగ్ మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మూయలేదా..? పాయకరావు పేట షుగర్ ఫ్యాక్టరీని ఈ ప్రభుత్వమే అమ్మేసేందుకు సిద్దపడడం లేదా..?
రాష్ట్ర ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి పెరిగింది.ఓ జిల్లా ఎస్పీకి నెలకు రూ. 5 ఐదు కోట్లు ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి అందుతోంది.చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోంది.గత ప్రభుత్వం తన వాళ్లకు ఇసుక ఇచ్చుకుందని.. ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తోంది.
పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.అంచనాలు పెంచేశారని చంద్రబాబుపై విమర్శలు చేసిన ఇదే సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు..?
పోలవరం కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుంటే కేంద్రానికి అప్పజెప్పేయండి.. మేమే నిర్మిస్తాం. పోలవరం నిమిత్తం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లు ఇచ్చాం.మరో రూ. 700 కోట్లు ఇవ్వాల్సి ఉంది.. దీన్ని త్వరలో విడుదల చేస్తాం.పోలవరం కట్టిన లెక్కల ప్రకారం నిధులను విడుదల చేస్తున్నాం.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి విలీన మండలాల కోసం ఆర్డినెన్స్ కోసం నేను ప్రయత్నం చేసిన సందర్భంలో వైసిపి ఎక్కడుంది కనీసం కళ్లు తెరవని పార్టీలు కూడా మాట్లాడడమేనా అని ప్రశ్నించారు.
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అవినీతిపరుడని.. బీజేపీలో చేరుతున్నారని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు.2014లో రఘురామ క్రుష్ణంరాజు బిజెపిలో చేరితే గోకరాజుగంగరాజుకు సీటు ఇచ్చాం రఘురామకు ఇవ్వలేదు. అయితే ఎంపి సీటు ఇచ్చిన వైసిపి ఇప్పుడు ఈ విధంగా ఎలా మాట్లాడుతుంది. గోకరాజు గంగరాజు పెద్దకుమారుడ్ని వైసిపిలో చేర్చుకోలేదా మీరు చేర్చుకుంటే ఒకటి మరొక పార్టీ చేర్చుకుంటే ఒక విధానమా మీది నోరా తాటిపట్టా.ఈ రోజే రఘు రామకృష్ణం రాజు అవినీతి వైసీపీ నేతలకు గుర్తుకు వచ్చిందా..?
కోట్లు ఖర్చుపెట్టి ఎడ్వర్టైజ్మెంట్సు ఇవ్వడమేకాని బడిపిల్లలకు నాణ్యమైన కోడిగుడ్డఇచ్చే దిక్కులేదు ఇదా పరిపాలనంటే అంటూ విరుచుకు పడ్డారు. జలజీవన్ మిషన్ కు కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్రం వాటా ఎందుకు ఇవ్వడం లేదని సోమువీర్రాజు సూటిగా ప్రశ్నించారు.సర్వశిక్షా అభియాన్ నిదులుతో నాడు నేడు పేరుతో నిధులు ఖర్చు చేస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ కింత ఈ సంవత్సరంలో 60వేల కోట్లు నిధులు కేంద్రం విడుదల చేసిందని అని అయితే కనీసం విద్యార్ధులకు నాణ్యమైన కోడిగుడ్డు కూడా ఇవ్వడంలేదు . అయితే అంగన్ వాడీలకు, డ్వాక్రా సంఘాలు, ఈవిధంగా అన్ని వ్యవస్థల్లోను సంఘాలు ఏర్పాటు చేసిన కమ్యూనిస్టులకు ఇవేమీ గుర్తుకు రావా వీరు నోట్లు మన్ను పెట్టుకున్నారా తీవ్రపదజాలంతో ప్రశ్నించారు.50 గ్రాము ల కోడిగుడ్డు కూడా ఇవ్వలేరా ఎమ్మెల్యేలు పర్యవేక్షణ చేయారా అని ప్రశ్నించారు. సహజవనరులను ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ఆరోపించారు.
పాత్రికేయుల సమావేశంలో తొలుత బిజెపి భవిష్యత్ కార్యక్రమాలను సోమువీర్రాజు వివరించారు. ఈనెల 10 వతేదీన అమరావతిలో నిర్మించిన ఫ్లైవర్స్ నిర్మాణాన్ని ప్రారంభిస్తారని ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పాల్గొంటారని వివరించారు. డిసెంబర్ 23వ తేదీన సేంద్రీయ వ్యవసాయం పై కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25వ తేదీని వాజ్పేయ్ పుట్టిన రోజు సందర్భంగా గుడ్ గవర్న్ న్స్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 24 వతేదీ లోపు జిల్లా స్ధాయిల్లో శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 26 వ తేదీని ప్రధాని మన్కీబాత్ కార్యక్రమా న్ని మండలంలో అయిదు ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. ఈ నెల 28వ తేదీన ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ భారీ ధర్నా ఆందోళన నిర్వహిస్తామన్నారు.పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం పాల్గొన్నారు

Leave a Reply